E-Paper
Advertisement

Prithviraj Sukumaran: ‘NTR 31’ లేదా ‘కేజీఎఫ్ 3’తో సలార్‌కు లింక్ ఉంటుందా? పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ వైరల్

Prithviraj Sukumaran: ‘NTR 31’ లేదా ‘కేజీఎఫ్ 3’తో సలార్‌కు లింక్ ఉంటుందా? పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ వైరల్
Advertisement

Prithviraj Sukumaran: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ బాక్సాఫీసును ఎంతలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ముందుగా ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి హైప్ వేరే లెవెల్లో ఉంది. అదీగాక పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లు, ట్రైలర్‌లతో సినిమా రేంజ్ మరో స్థాయికి చేరుకుంది. సినిమా రిలీజ్ అనంతరం అంచనాలు రెట్టింపయ్యాయి.

సలార్‌లో ప్రభాస్‌ లుక్‌ను చూసి ఆశ్యర్యపోయారు. సినిమా మొత్తం మాస్ యాక్షన్ లుక్‌లో ప్రభాస్‌ను చూసి అభిమానులు మురిసిపోయారు. ఇంతవరకు ఎన్నడూ చూడని రగ్గడ్‌లుక్‌లో ప్రభాస్‌ను చూపించినందుకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే ఇందులో మరొక పాత్ర కూడా అత్యంత కీలకంగా ఉంది. అదే శివమన్నార్ పాత్ర.

Advertisement

ఈ పాత్రలో నటించిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టేశాడు. బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.700 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా సీక్వెల్‌కు కూడా రెడీ అయింది. ఈ సీక్వెల్ చిత్రాన్ని ‘సలార్ 2: శౌర్యాంగపర్వం’ టైటిల్‌తో తెరకెక్కబోతుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’పై ఆసక్తికర అప్డేట్ అందించాడు.

Also Read: సలార్ 2 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. అఫీషియల్‌గా చెప్పేసిన నటుడు

Advertisement

ఇందులో భాగంగా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ట్విట్టర్ (ఎక్స్)లో ఓ నెటిజన్.. శివమన్నార్ పాత్రను మరింత గ్రాండ్‌గా చూడాలనుకుంటున్నామని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై పృథ్వీరాజ్ స్పందించి అదిరిపోయే సర్ప్రైజ్ అందించాడు. ఇందులో భాగంగా శివమన్నార్ పాత్ర సలార్‌లో మాత్రమే కాకుండా వేరే యూనివర్స్‌లోనూ ఉంటుందని ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు.

శివమన్నార్ పాత్ర చాలా కూల్‌గా ఉంటుందని కూడా తెలిపాడు. ‘‘దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన అన్ని స్టోరీల్లో శివమన్నార్ పాత్ర చాలా కూల్‌గా అనిపించింది. ఇది మరొక యూనివర్స్‌తో నమశక్యం కాని విధంగా క్రాస్ ఓవర్ ఉంటుంది’’ అని ట్వీట్ చేశాడు. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీకి వేరే చిత్రంతో లింక్ చేసే ప్లాన్‌లో ఉన్నాడని హింట్ ఇచ్చేశాడు.

ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు, సలార్ సినీ ప్రియులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. చాలా మంది థాంక్యూ పృథ్వీరాజ్ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే పృథ్వీరాజ్ అందించిన ఈ అప్డేట్‌తో సినీ ప్రియుల్లో ఆలోచనలు మొదలయ్యాయి. అందులో ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా మొదలు కాబోతున్న చిత్రంతో.. సలార్‌ను లింక్ చేస్తాడా అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరేమో.. యష్ నటించబోయే కేజీఎఫ్ 3కి.. సలార్‌కు లింక్ ఉండే ఛాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు. మరి దర్శకుడి ప్లాన్ ఎలా ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×