Big Stories

PM Modi: నేడు వేములవాడ రాజన్నకు కోడెమొక్కులు చెల్లించనున్న ప్రధాని మోదీ

PM Modi to Visit Telangana(TS today news): నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రానికి రానున్నారు. కరీంగనర్, వరంగల్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ఆరూరి రమేష్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

- Advertisement -

ముందుగా హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో వేములవాడకు చేరుకుంటారు. అనంతరం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్నకు కోడెమొక్కులు చెల్లించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తరువాత కోర్టు పక్కన ఉన్న మైదానంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

- Advertisement -

అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో వరంగల్ బయలుదేరి మామునూరు చేరుకుంటారు. అక్కడి నుంచి లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఓటు వేయాల్సిందిగా ప్రజలను ఆయన కోరనున్నారు. ప్రధాని పర్యటించనున్న సందర్భంగా బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

వరంగల్ సభలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఏపీకి బయలుదేరనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాత ఓ రోడ్ షోలో కూడా ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు.

Also Read: ‘ఏపీ సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ మీద ఎలా ఉండగలిగారు..?’

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే పలు దఫాలుగా తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఎక్కువగా ఎంపీ సీట్లు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్ర నేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా ఎక్కువ సీట్లను గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని, ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యపోటీ ఉంటుందని వారు చెబుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News