Big Stories

DC vs RR Highlights IPL 2024: రాజస్థాన్ కి బ్రేక్.. రేస్ లోకి ఢిల్లీ

Delhi Capitals vs Rajasthan Royals IPL 2024 Highlights: రాజస్థాన్ కి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఇంతవరకు అప్రహితంగా సాగిపోతున్న జట్టుకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్ననే హైదరాబాద్ మీద 1 పరుగుతో ఓడిన రాజస్థాన్ నేడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

- Advertisement -

టాస్ గెలిచి రాజస్థాన్ బౌలింగు తీసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగుకి వచ్చిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ అదే 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి పరాజయం పాలైంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే 222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకి అవుట్ అయిపోయారు. ముఖ్యంగా యశస్వి జైశ్వాల్ (4), జోస్ బట్లర్ (19) చేసి అవుట్ అయ్యారు. దీంతో భారమంతా కెప్టెన్ సంజూ శాంసన్ పై పడింది. దీంతో తను బాధ్యతాయుతంగా ఆడాడు. 46 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి మళ్లీ సెంచరీ ముందు అవుట్ అయిపోయాడు.

తను ఉన్నంతవరకు మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోనే ఉంది. సంజూ అవుట్ అయ్యే సమయానికి  15.4 ఓవర్ వద్ద స్కోరు 162 పరుగుల మీద ఉంది. అప్పటికి 26 బంతుల్లో 60 పరుగులు చేయాలి. టీ 20లో అది పెద్ద స్కోరు కాదు. కానీ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (27), శుభమ్ దుబె (25), రోవమన్ పోవెల్ (13) ఇలా అయిపోయారు.

Also Read: టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం.. ఈ ఏడు రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే..

తర్వాత ఎవరూ నిలబడలేదు. డోనోవాన్ ఫెర్రీరా (1), అశ్విన్ (2), అవుట్ అయ్యారు. తర్వాత ఆవేశ్ ఖాన్ (7), ట్రెంట్ బౌల్ట్ (2) నాటౌట్ గా ఉన్నప్పటికి 20 ఓవర్లలో రాజస్థాన్ 201 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఢిల్లీ బౌలింగులో ఖలీల్ అహ్మద్ (2), ముఖేష్ కుమార్ (2), అక్షర్ పటేల్ (1), కులదీప్ యాదవ్ (2), రశిఖ్ సలమ్ 1 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. జేక్ ఫ్రేజర్ 20 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశారు. మరో ఓపెనర్ అభిషేక్ పోరల్ 36 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీకి బలమైన పునాదులు పడ్డాయి. దీంతో మిగిలినవాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయినా పెద్ద ఫరక్ పడలేదు.

కాకపోతే ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. భారీ టార్గెట్ ప్రత్యర్థులకి ఇచ్చేలా ఆడాడు. తనకి గుల్బదిన్ నయిబ్ (19) సపోర్ట్ చేశాడు. అయితే అక్షర్ పటేల్ (15), కెప్టెన్ రిషబ్ పంత్ (15), రశిఖ్ సలమ్ (9) ఇలా ఆడటంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ టార్గెట్ ను రాజస్థాన్ ముందు పెట్టింది.

రాజస్థాన్ బౌలింగులో ట్రెంట్ బౌల్ట్ 1, సందీప్ శర్మ 1, అశ్విన్ 3, చాహల్ 1 వికెట్ పడగొట్టారు.

రాజస్థాన్ ఓడినా టాప్ 2 లోనే కొనసాగుతోంది. ఢిల్లీ మాత్రం 12 పాయింట్లతో… 5వ స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు 12 పాయింట్లతో 4 జట్లు… ప్లే ఆఫ్ లో చివరి 2 స్థానాల కోసం పోటీ పడుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News