E-Paper
Advertisement

IPL 2024: శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా.. రిపీట్ అయితే ఒక మ్యాచ్ వేటు..

IPL 2024: శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా.. రిపీట్ అయితే ఒక మ్యాచ్ వేటు..
Advertisement
Shubman Gill Fined For Slow Over Rate
Shubman Gill Fined For Slow Over Rate

Shubman Gill Fined For Slow Over Rate: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బుధవారం రూ. 12 లక్షల జరిమానా పడింది.

ఈ సీజన్‌లో తొలిసారి స్లో ఓవర్ రేట్ నమోదు అవ్వడంతో గిల్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. మరో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైతే గిల్‌పై ఒక మ్యాచ్ వేటు పడనుంది.

Advertisement

ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటన చేసింది. గిల్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్‌ని బ్రేక్ చేశారని.. సీఎస్కేతో జరిగిన మ్యచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైందని.. అందుకే గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ ప్రకటనలో పేర్కొంది.

ఈ టోర్నమెంట్‌లో గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 63 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Advertisement

IPL ఫ్రాంచైజీకి గిల్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్ తమ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: CSK Vs GT: గుజరాత్ టైటాన్స్ చిత్తు.. చెన్నై ఘనవిజయం..

ఇప్పటి వరకు ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. గుజరాత్ తన తర్వాతి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×