BigTV English
Advertisement

Krish 4: రూమర్స్ కి చెక్.. హృతిక్ తో రొమాన్స్ కి సిద్ధమైన హీరోయిన్..!

Krish 4: రూమర్స్ కి చెక్.. హృతిక్ తో రొమాన్స్ కి సిద్ధమైన హీరోయిన్..!

Krish 4: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించిన ‘క్రిష్’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకి సీక్వెల్స్ కూడా తీసుకొచ్చారు. అలా చివరిసారిగా 2013లో ‘క్రిష్ -3′ సినిమాను విడుదల చేశారు. ఇక అప్పటినుంచి ఈ సినిమా ఊసే లేదు. కానీ అభిమానులు మాత్రం :క్రిష్ – 4’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి ఈ క్రిష్ -4 చిత్రానికి హృతిక్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక హృతిక్ రోషన్ తో పాటు ఆదిత్య చోప్రా కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


హృతిక్ రోషన్ తో రొమాన్స్ కి సిద్ధమైన ప్రియాంక చోప్రా..

ఇకపోతే ఎప్పుడైతే క్రిష్ – 4 సినిమా ప్రకటన విడుదల అయ్యిందో .. ఇక అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా ఇందులో నటించబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) క్రిష్ -4 లో నటించదని వార్తలు రాగా.. ఈ వార్తలలో నిజం లేదని తేలిపోయింది. ఇక క్రిష్ -4 లో హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేయడానికి ప్రియాంక చోప్రా సిద్ధమయ్యింది. ఇక వీరితోపాటు ప్రీతి జింటా, వివేక్ ఒబెరాయ్, రేఖ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి అయితే భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా మరెలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Prabhudeva: నయనతార వల్లే విడిపోలేదు.. నిజాలు బయటపెట్టిన ప్రభుదేవా భార్య..!

వరుస అవకాశాలతో బిజీగా మారిన ప్రియాంక చోప్రా..

ఇక ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. బాలీవుడ్ ని వదిలేసి హాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయిన ఈమెకు.. ఈమధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే రాజమౌళి (Rajamouli) ప్రియాంక చోప్రా కి ఉన్న గ్లోబల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని.. తాను మహేష్ బాబు (Maheshbabu) తో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమాలో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటిస్తున్న ఈమె ఇటీవలే ఒడిస్సాలో తన పార్ట్ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకొని న్యూయార్క్ కి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో వస్తున్న #AA 22 సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు రాగా.. మరొకవైపు ఆమె దానిని రిజెక్ట్ చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ సినిమాలో మరో హీరోయిన్ ను తీసుకోవడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేయడానికి ప్రియాంక చోప్రా సిద్ధం అయిపోయింది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో కూడా ఈమె పాల్గొనబోతోంది. ఏది ఏమైనా గ్లోబల్ స్టార్ కి ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్టు అనిపిస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×