Summer AC Tips: సమ్మర్ లో ఎండలు మండిపోతాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలను వాడుతారు. కొన్నిసార్లు ఏసీలు పేలిపోతుంటాయి. రకరకాల కారణాలతో పలు సమస్యలకు కారణం అవుతాయి. ఇంట్లో, లేదంటే ఆఫీస్ లో ఏసీ వాడే వాళ్లు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ అవేంటంటే..
ఏసీని వాడేవాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు
⦿ గ్యాస్ చెక్ చేయాలి
ఏసీలో గ్యాస్ తక్కువగా ఉండటం వల్ల అది వేడెక్కుతుంది. కొన్నిసార్లు పేలే ప్రమాదం ఉంటుంది. ఎప్పటికప్పుడు రిఫ్రిజెరాంట్ తనిఖీ చేస్తూ ఉండాలి. తగ్గినట్లు అనిపిస్తే ఫిల్ చేయించుకోవాలి. ఏసీ సర్వీస్ చేసే సమయంలో గ్యాస్ లీకేజీ గురించి కూడా చెక్ చేయించండి. ఒకవేళ గ్యాస్ లీక్ అయినట్లు అనిపిస్తే, ఏసీ ఆఫ్ చేసి, టెక్నీషియన్ కు ఇన్ ఫామ్ చేయండి. తగిన రిపేర్ చేయించండి.
⦿ కంప్రెసర్ వేడెక్కడ
వేసవిలో ఎక్కువగా ఏసీ వినియోగించడం వల్ల ఓవర్ లోడ్ సమస్య ఎదురవుతుంది. అదే సమయంల కంప్రెసర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. కొన్నిసార్లు కంప్రెసర్ వేడెక్కుతుంది. ఇలాంటి సమయంలోనూ ఏసీ పేలేందుకు అవకాశం ఉంటుంది. కంప్రెసర్ వేడెక్కేందుకు కారణాలు తెలుసుకుని, అలా కాకుండా చూసుకోండి. ఏసీని కూడా ఎక్కువ సేపు ఆన్ లో ఉంచకూడదు. గదిలో ఉన్నంత సేపు మాత్రమే ఏసీ ఆన్ చేయాలి. ఆ తర్వాత ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కరెంట్ బిల్లు కూడా తగ్గుతంది.
⦿ కరెంటులో హెచ్చు తగ్గులు
ఏసీ ప్రమాదాలకు కారణాల్లో ముఖ్యమైనది కరెంటులో హెచ్చు తగ్గులు. ఓల్టేజీలో తేడాల కారణంగా ఏసీ పేలే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏసీ ఇన్ స్టాల్ చేసే సమయంలో స్టెబులైజర్ అవసరం లేదంటారు. కానీ, కరెంటు హెచ్చుతగ్గుల నుంచి కాపాడటంలో స్టెబులైజర్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, స్టెబులైజర్ లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఏసీ పేలుడుకు గురవ్వచ్చు. వీలైనంత వరకు ఓల్టేజీ స్టెబులైజర్ ను ఇన్ స్టాల్ చేయించుకోవాలి.
Read Also: ఈ చిట్కాలతో స్మార్ట్‌గా కూలర్ కూలింగ్..కరెంట్ బిల్ తగ్గించే సీక్రెట్ టిప్స్
ఏసీని ఎక్కువగా వాడేవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
⦿ ఏసీని ఎక్కువగా వాడేవాళ్లు ఫిల్టర్స్ ను తరచుగా శుభ్రం చేయాలి.
⦿ ఏసీ ఫిల్టర్స్ ను చాలా మంది సబ్బుతో కడుగుతుంటారు. పూర్తిగా ఆరిన తర్వాతే బిగించాలి.
⦿ ఎక్కువ సేపు ఏసీలో ఉండేవాళ్లు నాలుగు, ఐదు గంటలకు ఒకసారి బయటకు వెళ్లాలి.
⦿ ఏసీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏవైన ఆరోగ్య సమస్యలు ఏర్పడితే, గది చల్లగా మారిన తర్వాత ఏసీని ఆఫ్ చేయడం మంచిది. ఆ తర్వాత ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది.
ఈ ఏడాది గతంతో పోల్చితే వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఏసీల వినియోగం కూడా ఎక్కువగా ఉండబోతోంది. ఏసీ వినియోగించే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Read Also: అగ్ని ప్రమాదంలో మంటలు కంటే.. పొగే డేంజర్, ఇలా చేస్తేనే ప్రాణాలు దక్కుతాయ్!