Prabhudeva.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా , హీరోగా తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్నారు ప్రభుదేవా(Prabhudeva). ఇక ప్రస్తుతం మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ మూవీ గా వస్తున్న’ కన్నప్ప’ సినిమాకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రభుదేవా కెరియర్ పరంగా ఎంత గుర్తింపు అయితే తెచ్చుకున్నారో.. వ్యక్తిగతంగా అంతే విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రామలతను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న వీరికి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత నయనతార (Nayanthara) మీద ఇష్టంతో రామలతకు విడాకులు ఇచ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే దీనికి తోడు అటు రాములత కూడా గతంలో నయనతార వల్లే మేము విడిపోతున్నాం అంటూ కామెంట్లు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం నయనతార వల్ల మేం విడిపోలేదు అంటూ విస్తుపోయే నిజాలు బయటపెట్టింది రామలత.
నయనతార వల్ల మేం విడిపోలేదు – రామలత
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామలత మాట్లాడుతూ.. “నేను, ప్రభుదేవా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాము. మాకు ముగ్గురు మగ పిల్లల సంతానం కలిగింది. అయితే ఒక అబ్బాయి టీనేజ్ లోనే మరణించాడు.. దాంతో మా ఇద్దరి మధ్య తరచూ విభేదాలు వచ్చేవి. ఇక తట్టుకోలేకే విడాకులు తీసుకున్నాము అంటూ తెలిపింది ?”:రామలత. ఇక ఇన్ని రోజులు నయనతార వల్లే ప్రభుదేవా – రామలత విడిపోయారంటూ వస్తున్న వార్తలకు ఆమె స్వయంగా చెక్ పెట్టింది అని చెప్పవచ్చు. ఇక అలాగే తన కొడుకులు, భర్త గురించి మాట్లాడుతూ.. “ప్రభుదేవా 50 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమాని సింగ్ ను వివాహం చేసుకోగా, వారికి ఒక పాప జన్మించింది. అయినా సరే ప్రభుదేవా కు మా పిల్లలంటే ప్రాణం. వారిని అపురూపంగా చూసుకుంటాడు. నా ఇద్దరి కొడుకులకు కూడా ఆయనతో మంచి అనుబంధం ఉంది.బయటకు వెళ్లాలన్నా సరే నా అనుమతితో పాటు ప్రభుదేవా అనుమతి కూడా తీసుకుంటారు.
విడాకులు మాత్రమే అయ్యాయి.. ఎలాంటి గొడవలు లేవు -రామలత
ప్రభుదేవాకు, నాకు విడాకులు అయ్యాయి కానీ అంతమాత్రాన మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైగా నాకు,నా పిల్లలకు అతడే సపోర్టుగా నిలబడ్డాడు..ఎన్నడూ నా గురించి చెడుగా మాట్లాడలేదు. అందుకే నా జీవితాంతం నేను ఆయనను వదిలిపెట్టుకొను. అయితే ఒంటరిగా పిల్లల్ని పెంచడం కష్టమే. కానీ ఆ కష్టాల్ని నేను అధిగమించాను. మంచి తండ్రిగా ప్రభుదేవా నా పిల్లల కోసం, మంచి భర్తగా నాకోసం ఎప్పుడూ నిలబడ్డారు. ,కానీ చిన్న చిన్నవిభేదాలు వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది” అంటూ రామలత తెలిపింది. ఇక తన కొడుకుల గురించి చెబుతూ ప్రభుదేవా సంగీత కచేరీలో నా పెద్దకొడుకు రిషి డాన్స్ అద్భుతంగా చేసేవాడు. తన తండ్రి రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది. రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాడు .హీరోగా అవకాశాలకు ఇప్పుడు కథలు వింటున్నారు అయితే మా చిన్నవాడికి డాక్టర్ కావాలనే ఆశ ఉంది. అందుకే విదేశాలకు పంపించి మరీ చదివించాలని అనుకుంటున్నాము అంటూ రామలత తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nushrratt Bharuccha: మోడీ లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సిందే.. బెల్లంకొండ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్..!