BigTV English

Allu Arjun-Atlee : బన్నీ మూవీని రిజెక్ట్ చేసిన రామ్ చరణ్ హీరోయిన్… ఏంటి ఇదంతా రివేంజా..?

Allu Arjun-Atlee : బన్నీ మూవీని రిజెక్ట్ చేసిన రామ్ చరణ్ హీరోయిన్… ఏంటి ఇదంతా రివేంజా..?

Allu Arjun-Atlee : ‘పుష్ప 2’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో పేరు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అట్లీ (Atlee)దర్శకత్వంలో తన 22వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalhanidhi Maran)ఏకంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం రూ.125 కోట్లు కేటాయించగా.. ఒక అల్లు అర్జున్ కోసం మాత్రమే రూ.175 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాలలో 20% వాటా అల్లు అర్జున్ కి ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.


అల్లు అర్జున్ మూవీ ని రిజెక్ట్ చేసిన ప్రియాంక చోప్రా..

ఇదిలా ఉండగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే .ప్రియాంక చోప్రా మహేష్ బాబు (Maheshbabu ) రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 (SSMB -29) సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాతే పలు తెలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని, అందులో భాగంగా #AA22 మూవీకి కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇక హాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేసి టాలీవుడ్ లోనే సెటిల్ కాబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ వార్తలు ఆ వాస్తవమని.. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమా కాబట్టి ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.


రివేంజ్ టైం అంటున్న మెగా ఫ్యాన్స్..

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా అల్లు అర్జున్ 22వ చిత్రంలో ప్రియాంక చోప్రా నటించడం లేదని తెలిసి మెగా అభిమానులు కొత్త వార్తలను వైరల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సినీ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా మెగా వర్సెస్ అల్లు వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు సింగపూర్లో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ (Pawanovich) అగ్ని ప్రమాదంలో ఇరుక్కున్నారు. కాళ్లు ,చేతులకు గాయాలు అవ్వడమే కాకుండా ఊపిరితిత్తుల్లోకి పొగ చూరడంతో ప్రస్తుతం బాలుడు హాస్పిటల్లో ఉన్నారు. అటు దేశ ప్రధాని మొదలు ప్రత్యర్థి పార్టీ నాయకులైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి రోజా కూడా బాలుడు ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్లు కూడా వేశారు. అయితే అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా దీనిపై స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్ధులే బాలుడు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటే.. సొంత కుటుంబీకులైన అల్లు ఫ్యామిలి వారు కనీసం బాలుడి గురించి ఒక్క మాట కూడా అడగకపోవడంతో వారు ఎలాంటి వారో ఒక్కసారి ఆలోచించండి అంటూ మెగా అభిమానులు పెద్ద ఎత్తున వార్తలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ మూవీలో ప్రియాంక హీరోయిన్గా నటిస్తుందని తెలిసిన వెంటనే రామ్ చరణ్ తో అత్యంత సన్నిహితంగా ఉండే ప్రియాంక చోప్రా రామ్ చరణ్ కారణంగానే ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ ని రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రామ్ చరణ్, ప్రియాంక చోప్రా గతంలో ‘జంజీర్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరి మధ్య స్నేహబంధం మరింత పెరిగింది. ఈ స్నేహబంధం కారణంగానే ప్రియాంక.. అల్లు అర్జున్ మూవీని రిజెక్ట్ చేసినట్లు మెగా అభిమానులు వార్తలు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు ఇది రివేంజ్ టైమ్ అని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..

OG OTT: ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయిన ఓజీ ఓటీటీ రైట్స్..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×