School Girl ousted From Exam Due To Menstruation| పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గరువులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. బాలిక అని కూడా చూడకుండా ఆమెతో అమానుషంగా వ్యవహరించి సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. మానవ శరీరంలో ప్రకృతి పరంగా వచ్చే మార్పులను స్కూల్ టీచర్లు హీనంగా చూశారు. ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఒక బాలికకు మొదటిసారి రుతుస్రావం (పీరియడ్స్) వచ్చింది. ఈ కారణంగా ఆమె రెండు రోజులు ఇంట్లోనే ఉంది. కానీ స్కూల్ లో పరీక్షలు ఉండడంతో ఆమె బడికి వెళ్లింది. కానీ అక్కడ పరీక్షలు రాస్తుండగా.. టీచర్లు ఆమె సమస్య గురించి తెలుసుకొని పరీక్ష గదిలో ఆమెను కూర్చోనివ్వలేదు. పైగా ఆమె గది నుంచి వెలివేశారు. గది బయట నేల మీద కూర్చొని పరీక్ష రాయాలని ఆదేశించారు. అలా ఆ బాలిక పరీక్ష గది బయట నేల మీద కూర్చొని రాస్తుండగా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా పెట్టారు ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా.. కినతుకడవు తాలూకాలోని ఒక బాలిక స్థానికంగా ఉన్న స్వామి చిద్భవంద మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఈ బాలికకు ఏప్రిల్ 5న మొదటిసారి పీరియడ్స్ వచ్చాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు ఆమెను రెండు రోజులు ఇంట్లోనే ఉంచారు. కానీ ఏప్రిల్ 7 తేదీన 8వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల వార్షిక పరీక్షలు కాబట్టి తల్లిదండ్రులు బాలికను బడికి పంపించారు. అయితే బాలికకు పీరియడ్స్ (Menstruation) ఉన్నట్లు తెలియగానే ఉపాధ్యాయులు ఆమెను తరగతి గది నుంచి బయటికి పంపారు. గదిలోకి రాకూడదని ఆదేశించారు. లోపలికి రావడానికి అనుమతి లేదు, బయటే కూర్చుని పరీక్ష రాయాలని చెప్పారు. అందుకే అమ్మాయి బయటే కూర్చుని పరీక్ష రాసింది.
బాలిక సాయంత్రం ఇంటికి చేరుకున్న తర్వాత తల్లికి ఈ విషయం చెప్పింది. ఇది విన్న తల్లి తీవ్ర కోపానికి గురైంది. మరుసటి రోజు బడికి వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడుతానని చెప్పింది. తర్వాత రోజు విద్యార్థిని బడికి పంపించి, తాను 10:30 గంటలకు బడికి వెళ్లింది. అప్పుడు కూడా బాలిక బయట కూర్చుని పరీక్ష రాస్తున్నట్లు కనిపించింది. దీంతో తల్లి మొబైల్ ఫోన్ తీసుకుని వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించింది. తర్వాత ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి “ఎందుకు ఇలా కూర్చోబెట్టారు?” అని ప్రశ్నించింది. “పీరియడ్స్ వచ్చాయి కాబట్టి ఇలా చేశాము” అని చెప్పగా.. టీచర్లతో బాలిక తల్లి ఇది సరైన పద్ధతి కాదని వాదించింది. ఉపాధ్యాయులు కూడా ఆమెతో వాగ్వాదం చేశారు.
Also Read: మూడు సంవత్సరాలుగా ప్రతిరోజు పీరియడ్స్.. కారణం చెప్పలేని డాక్టర్లు.. ఎలా తెలిసిదంటే
ఈ ఘటన తరువాత ఇంటికి వచ్చిన బాలిక తల్లి.. బడిలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్ది సేపట్లోనే ఇది వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన నెటిజెన్లు.. విషయం తెలిసన ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేవలం పీరియడ్స్ వచ్చాయి, ఆమెకు ఎలాంటి సమస్య లేదు” అని ఒకరు కామెంట్ చేస్తే.. “ఈ ఆధునిక యుగంలో కూడా ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలరు?” అని మరొక ఎక్స్ యూజర్ ప్రశ్నించారు. మరోవైపు, బాలిక తల్లి ఈ విషయంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది.
➡️A class 8th student of a private school in Coimbatore district, Tamil Nadu was made to sit outside the classroom on steps and take the examinations. As per school management/teachers, this was done as she was having her menstruation (periods).
➡️Menstruation is a normal… pic.twitter.com/CH5EZfysPc— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) April 10, 2025