OG OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపడుతూనే.. మరొకవైపు అభిమానుల కోసం సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలా ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’, ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలలో నటిస్తున్నారు.ఇకపోతే ఈ చిత్రాలలో ‘ఓజీ’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు గ్లింప్స్ విడుదల చెయ్యగా.. పవన్ అభిమానులతో పాటు సినిమా లవర్స్ కి కూడా ఇవి బాగా నచ్చేసాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
OG సినిమాపై పెరుగుతున్న అంచనాలు..
అటు పవన్ కళ్యాణ్ 20 రోజులు టైం కేటాయిస్తే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తానని, అటు సుజీత్ (Sujeeth) కూడా తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. దీనికి తోడు ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో తన చిన్న కొడుకు మార్క్ శంకర్ (Mark Shankar)గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొడుకు ఆరోగ్య నిమిత్తం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. ఇలాంటి ఇబ్బందుల వల్ల ఈయన ఇప్పట్లో ఈ సినిమాకు డేట్స్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఓజీ సినిమాకి మాత్రం హైప్ బాగా పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ సభకు వెళ్ళినా సరే అక్కడ ఓజీ ఓజీ అనే అభిమానులు అరుస్తూ కేకలు వేస్తున్నారు.
ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయిన ఓటీటీ రైట్స్..
అలా ఒక రేంజ్ లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వేళ ఇప్పుడు మార్కెట్లో కూడా ఈ సినిమాకి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే థియేట్రికల్ కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్న వేళ.. అటు ఓటీటీలోకూడా గట్టి పోటీ ఏర్పడిందని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఓజీ శాటిలైట్ హక్కులను రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో డిమాండ్ బాగానే ఉందని, అందుకే ఇప్పుడు ఫ్యాన్సీ రేట్ కి ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ మొత్తానికైతే ఓజీ సినిమాకి ఉన్న డిమాండ్ కారణంగా.. ఈ రేంజ్ లో అమ్ముడుపోవడం పెద్ద విషయం ఏమి కాదని అటు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Samantha: రెండో పెళ్లిపై కుటుంబంతో చర్చిస్తున్న సమంత.. ముహూర్తం ఎప్పుడంటే..?
పవన్ డేట్స్ కోసం ఎదురుచూపు..
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒక 20 రోజుల పాటు ఏదోలాగా డేట్స్ కేటాయిస్తే మాత్రం వచ్చే దసరాకి చాలా గ్రాండ్గా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ లో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దాంతో రూ.500 కోట్ల గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేస్తుందని కూడా మేకర్స్ భావిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్, ముంబై మాఫియా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా పవన్ స్థాయిని మరింత పెంచుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.