Fenugreek Seeds: మెంతులు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇవి ఆహారం రుచిని పెంచడమే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తాయి. వ్యాధులతో పోరాడటంలో కూడా ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడే వారు ప్రతి రోజు మెంతులను తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో అసలు ఎలాంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, ముఖ్యంగా షుగర్ అదుపులో ఉంచడానికి ఏ విధంగా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి గింజలే కాదు, విత్తనాలు కూడా అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మెంతులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వివిధ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.
మెంతి గింజల యొక్క ప్రయోజనాలు:
షుగర్ కంట్రోల్:
మెంతులు మధుమేహం ఉన్న వారికి వరం అనే చెప్పవచ్చు. ఇందులోని కరిగే ఫైబర్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా ఇది చక్కెర శోషణను కూడా కంట్రోల్ చేస్తుంది. మెంతి గింజలు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. షుగర్ కంట్రోల్ చేయడంలో ప్రభావ వంతంగా పనిచేస్తాయి. టైప్ – 2 డయాబెటిస్ తగ్గాలంటే క్రమం తప్పకుండా మెంతులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
జీర్ణక్రియ:
మెంతుల్లో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మలబద్దకం వంటి సమస్య నుండి ఉపశమనం కలిగించడానికి అంతే కాకుండా పేగు కదలికలను క్రమబద్దం చేయడానికి ఉపయోగపడతాయి. గ్యాస్ సమస్యను నివారించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెంతి గింజలు జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రోత్సహించే కొన్ని సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి. ఇది ఆహారం బాగా జీర్ణమయ్యేలా కూడా చేస్తుంది.
కొలెస్ట్రాల్ కంట్రోల్:
అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణం అవుతుంది. మెంతులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిరైడ్ల స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. దీనిలోని సాపోనిన్స్ పిలువబడే.. సమ్మేళనాలు పేగులలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బాలింతలకు ప్రయోజనకరం:
పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో మెంతి గింజలు చాలా బాగా ఉపయోపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మెంతులలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు తల్లి పాల ఉత్పత్తికి కారణం అయ్యే ప్రోలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
వాపును తగ్గించడం:
మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాపుకు ప్రధాన కారణమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఆర్థరైటిస్, ఇతర సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు:
మెంతి గింజలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి. మెంతి గింజలు జుట్టును బలోపేతం చేయడానికి, చుండ్రును తగ్గించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కూడా ఉపయోగిస్తారు.
మెంతి గింజలు తినడానికి మార్గాలు:
మీ ఆహారంలో మెంతి గింజలను చేర్చుకోవడానికి అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి:
మెంతి గింజల నీరు: ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని వడకట్టి తాగాలి. తర్వాత నీటిలో నానబెట్టిన మెంతులను కూడా నమలవచ్చు.
Also Read: కూల్ డ్రింక్స్ తాగుతున్నారా ? అయితే బట్టతల రావడం ఖాయం !
మెంతుల తరుగు: పప్పు లేదా కూరగాయలు వండేటప్పుడు, మెంతులను వేయండి
మెంతి టీ: ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ మెంతి గింజలను వేసి మరిగించాలి. దీన్ని వడకట్టి.. తేనె కలిపి త్రాగాలి.
మొలకెత్తిన మెంతి గింజలు: మెంతి గింజలను మొలకెత్తించి సలాడ్లు లేదా శాండ్‌విచ్‌లలో కూడా కలిపి తినవచ్చు. మొలకెత్తిన మెంతి గింజలు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి.
మెంతి గింజల పేస్ట్: మెంతి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి చర్మం లేదా జుట్టు మీద అప్లై చేయడం వల్ల కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి.
జాగ్రత్తలు: మెంతి గింజలను ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వాటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.