Teacher Attacked: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని అల్లరి చేస్తుందని బ్యాగ్ తో తల పై కొట్టిన ఉపాధ్యాయుడు. తల పగిలిందని నిర్ధారించిన వైద్యులు. చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాత్విక నాగశ్రీ (11) పొంగనూరు కు చెందిన భాష్యం పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తుందని హిందీ ఉపాధ్యాయుడు బ్యాగ్ తో తలపై కొట్టాడు. అదే పాఠశాలలో పనిచేస్తున్న సాత్విక నాగశ్రీ తల్లి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
తరువాత రోజు నుంచి తల నొప్పి అని విద్యార్థి ఏడుస్తూ పాఠశాలకు వెళ్లలేదు. పొంగనూరులో ఉన్న స్థానిక ఆసుపత్రి కి తీసుకొని వెళ్లారు. పరిశీలించిన వైద్యులు బాలికను బెంగళూరు తీసుకు వెళ్లాలని సూచించారు. స్కానింగ్ తీయగా పుర్రె ఎముక చిట్లినట్లు వైద్య పరీక్షలో తేలింది. దీనితో తల్లి పాఠశాల యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందీ ఉపాధ్యాయుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చు స్కూల్ యాజమాన్యం అందిచేందుకు ముందుకు వచ్చినప్పటికి కేసు విచారణ కొనసాగుతుందని డిఎస్‌పి ప్రభాకర్ తెలిపారు. హిందీ టీచర్‌ను విధుల నుండి తొలగించినట్లు చెప్పారు.