BigTV English

Bhumana – TTD: దొరికిపోయిన భూమన.. అలిపిరి ఆరోపణపై టీటీడీ రియాక్షన్ ఇదే!

Bhumana – TTD: దొరికిపోయిన భూమన.. అలిపిరి ఆరోపణపై టీటీడీ రియాక్షన్ ఇదే!

అలిపిరి వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహానికి ఘోర అపచారం జరిగిందని, మల మూత్రాదులు విసర్జించే ప్రదేశంలో మద్యం బాటిళ్ల మధ్య విష్ణు మూర్తి విగ్రహాన్ని పడేశారని, పట్టించుకోవడం మానేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అసత్యాలని తేలిపోయాయి. అసలు అది మహావిష్ణువు విగ్రహం కాదని టీటీడీ వివరణ ఇచ్చింది. అంతే కాదు, ఉద్దేశపూర్వకంగానే భూమన ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారని, నిన్న మొన్నటి వరకు లేని మద్యం బాటిళ్లను కూడా ఆయన టీమ్ తీసుకొచ్చి పెట్టిందని, చివరిగా ఆయన నాటకం రక్తి కట్టలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు టీటీడీ బోర్డ్ సభ్యులు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ భూమన అని మండిపడ్డారు. అబద్దపు, అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ… తిరుమల పవిత్రత టీటీడీ ప్రతిష్ఠను భూమన దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు.


అసలేం జరిగింది..?
తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లే అలిపిరి మార్గంలో ఓ పక్కన ఒక పెద్ద విగ్రహం పడి ఉంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు ఆ విగ్రహం వద్దకు వెళ్లారు. అది శ్రీ మహావిష్ణువు విగ్రహం అని, అలాంటి ప్రదేశంలో దాన్ని ఎలా ఉంచారంటూ ఆయన టీటీడీపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారిన తర్వాత తిరుమల ప్రతిష్టను మంటగలుపుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు, ఆ విగ్రహం పాదాలకు మొక్కి, కాసేపు అక్కడే మౌనంగా నిలబడి ఆ ఎపిసోడ్ ని రక్తి కట్టించాలని చూశారు. కానీ ఫలితం లేదు, రెండు గంటల్లోనే టీటీడీ సభ్యులు వివరణతో విరుచుకుపడ్డారు. భూమన నాటకాలు కట్టిపెట్టాలని దుయ్యబట్టారు.

నిజమేంటి?
అలిపిరి మార్గంలో రోడ్డు పక్కగా ఒక పెద్ద విగ్రహం పడి ఉన్న మాట నిజమే. అయితే అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు, శనిదేవుడి విగ్రహం. అందులోనూ అది పూజకు పనికిరాని విగ్రహం. ఆ విగ్రహం తయారీలో చిన్న లోపం ఉండటంతో దాన్ని అక్కడే వదిలేశారు. దీంతో పదేళ్లుగా ఆ విగ్రహం అక్కడ పడి ఉంది. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ విగ్రహం వ్యవహారాన్ని బయటపెట్టి, మహావిష్ణువు విగ్రహం అని మాయమాటలు చెప్పి, తిరుమలప్రతిష్టను దెబ్బతీసేలా భూమన, సాక్షి మీడియా నాటకాలాడుతున్నారంటూ టీటీడీ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బోర్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.


గతంలో అలిపిరి వద్ద ఒక ప్రైవేటు శిల్పకళాశాల ఉండేదని, పట్టు కన్నయ్య అనే శిల్పి దాన్ని నిర్వహించేవాడని టీటీడీ బోర్డ్ సభ్యులు వివరించారు. బెంగళూరు కి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడు విగ్రహాన్ని ఆర్డర్ ఇవ్వడంతో కన్నయ్య దాన్ని రూపొందించారని, అయితే శిల్పం తయారీలో లోపం ఉండటంతో దాన్ని అక్కడే వదిలేశారని అన్నారు. పదేళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉందని, నేడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ బోర్డ్ సభ్యులు మండిపడ్డారు. గతంలో శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవవిగ్రహానికి వేలు విరిగిపోగా, మూడున్నరేళ్లుగా దాన్ని పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మతులు చేయించామని వారు వివరించారు. స్వామివారి పట్ల అంత నిర్లక్ష్యం ఉన్న కరుణాకర్ రెడ్డి, హిందూత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు హెచ్చరించారు. భూమన ఇంట్లో ఆచరించే మత విశ్వాసాలు వేరని, బయట రాజకీయ ఉనికి కోసం, ధనర్జాన కోసం హిందువుడిలా కరుణాకర్ రెడ్డి నట్టిస్తున్నారని మండిపడ్డారు. మహావిష్ణువు విగ్రహానికి‌, అసంపూర్ణమైన శనిభగవానుడి విగ్రహానికి తేడా తెలీదా అని భూమనని ప్రశ్నించారు మరో సభ్యురాలు పనబాక లక్ష్మి. భూమన వ్యవహారం ఇలాగే ఉంటే.. ప్రజలు తిరగబడి తరమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.

Related News

Tirumala: తిరుమలలో ఘోర అపచారం.. అలిపిరి మార్గంలో నిర్లక్ష్యం

Chittoor: అల్లరి చేస్తోందని విద్యార్థిని పుర్రె పగలకొట్టిన టీచర్..

AP Students: విద్యార్థులకు ఏపీ బంపరాఫర్.. వడ్డీ లేని రుణాలు, ఇంకెందుకు ఆలస్యం

Adabidda Nidhi Scheme-2025: ఏపీ మహిళలకు తీపి కబురు.. నెలకు రూ.1500, ఎప్పటి నుంచి అంటే

Nellore News: పెన్నా నదిలో పేకాట.. చిక్కుల్లో 17 మంది యువకులు.. డామ్ గేట్లు ఓపెన్

Ap Govt: ఏపీలో ఐదు డిఫెన్స్ క్లస్టర్లు.. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు మహర్థశ

Vijayawada News: ఫుడ్ ఆర్డర్ మారింది.. ఇలా ఏంటని ప్రశ్నిస్తే.. పీక కోసేస్తారా భయ్యా..?

Big Stories

×