E-Paper
Advertisement

Animal Park: ‘యానిమల్ పార్క్’ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత

Animal Park: ‘యానిమల్ పార్క్’ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత
Advertisement

Animal Park Movie: తెలుగు డైరెక్టర్స్ అయినా కూడా బాలీవుడ్‌కు వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేసినవారు ఎంతోమంది ఉన్నారు. ఈ జెనరేషన్‌లో అలాంటి డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ అనే మూవీతో దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్.. డెబ్యూతోనే తానేంటో ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు. బాలీవుడ్‌లో కూడా తన అడుగు గట్టిగానే పడింది. రణబీర్ కపూర్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా చేసిన ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా ఈ మూవీని ఒక ఫ్రాంచైజ్‌లాగా చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు సందీప్. తాజాగా ‘యానిమల్’ సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ గురించి కీలక అప్డేట్ బయటికొచ్చింది.

కీలక అప్డేట్

Advertisement

‘యానిమల్’ సినిమా ఆ రేంజ్‌లో సక్సెస్ అవ్వడానికి సందీప్ రెడ్డి వంగా మాత్రమే కాదు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా కారణమే. 2023లో విడుదలయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా ‘యానిమల్’ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇక దీనికి సీక్వెల్ ఉండబోతుందని ఈ మూవీ క్లైమాక్స్‌లోనే చిన్న గ్లింప్స్‌తో హింట్ ఇచ్చాడు దర్శకుడు. అంతే కాకుండా ఈ మూవీని ఒక ఫ్రాంచైజ్‌లాగా ప్లాన్ చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చాడు. ‘యానిమల్’ సీక్వెల్‌కు ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్టు రివీల్ చేశాడు. ఇక తాజాగా ఈ సినిమా నిర్మాత అయిన భూషణ్ కుమార్.. ‘యానిమల్ పార్క్’ గురించి కీలక అప్డేట్ అందించాడు.

Also Read: ఆస్కార్ రేసులో ఇండియన్ షార్ట్ ఫిల్మ్… కేన్స్ లోనూ బెస్ట్ మూవీగా అవార్డు

Advertisement

‘స్పిరిట్’ పూర్తవ్వాలి

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే మూవీని ప్లాన్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశాడు. దీంతో ‘యానిమల్ పార్క్’ లేట్ అవుతోంది. అయితే ‘స్పిరిట్’ అయిపోగానే వెంటనే ‘యానిమల్ పార్క్’ ప్రారంభించే ఆలోచనలో సందీప్ రెడ్డి వంగా ఉన్నాడని భూషణ్ కుమార్ బయటపెట్టారు. ‘స్పిరిట్’ వల్ల సందీప్ ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటున్నాడని, అది అయిన వెంటనే ‘యానిమల్ పార్క్’పై ఫోకస్ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ అంతా తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. సందీప్ రెడ్డి వంగా నుండి ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయని ఎగ్జైట్ అవుతున్నారు.

ఖండించినా ఆగలేదు

‘యానిమల్’లో వైలెన్స్ ఎక్కువగా ఉందని, ఆడవారిని చిన్నచూపు చూసినట్టుగా ఉందని ఈ సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ఎంతోమంది ఈ మూవీని ఖండించారు. అయినా కూడా ‘యానిమల్’ థియేట్రికల్ రన్ ఆగలేదు. ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా చాలావరకు థియేటర్లలో ఈ సినిమా రన్ అయ్యింది. అలా ‘యానిమల్ పార్క్’ (Animal Park)పై అంచనాలు పెరిగిపోయాయి. చాలాకాలం క్రితం ‘యానిమల్ పార్క్’ ప్రారంభం అవ్వాలంటే 2026లోనే సాధ్యమని స్టేట్‌మెంట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. కానీ తాజాగా భూషణ్ కుమార్ ఇచ్చి స్టేట్‌మెంట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈలోపు రణబీర్ సైతం ‘రామాయణ్’ షూటింగ్ పూర్తిచేసుకుంటాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×