BigTV English

Allu Arvind: పండక్కి సినిమా రిలీజ్ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు

Allu Arvind: పండక్కి సినిమా రిలీజ్ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు

Allu Arvind:  ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న టాప్ మోస్ట్ ప్రాజెక్ట్స్ లో నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తున్న తండేల్ సినిమా ఒకటి. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు చందు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలామందికి కొత్తగా అనిపించింది. అలానే ఈ సినిమా మ్యూజిక్ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేశాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara entertainments) బ్యానర్ పై నాగ వంశీ నిర్మించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ నాగచైతన్య హీరోగా సవ్యసాచి అనే సినిమాను చేశాడు చందు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.


Also Read : Meenakshi Chaudhary: లక్కీ బ్యూటీని అలా ఎలా చేశారు.. ఆమె కోసమే మట్కా చూసేవాళ్ల పరిస్థితి ఏంటి.. ?

ప్రతి దర్శకుడికి తన కెరీర్ నిలబెట్టే సినిమా ఒకటి ఉంటుంది. అలా చందు దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 (Karthikeya 2) సినిమా చందు పాన్ ఇండియా దర్శకుడిని చేసేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద కార్తికేయ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. మొదటి ఈ సినిమాకి సరిగ్గా థియేటర్స్ కూడా దొరకలేదు. కానీ ఆ తర్వాత మౌత్ టాక్ వలన ఈ సినిమా హిట్ అయి విపరీతంగా థియేటర్స్ పెరిగి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాకి నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలు చందు కృష్ణుని గురించి ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కార్తికేయ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.


 

ఇకపోతే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్ చేస్తారని పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే ఆ టైం కి ఈ సినిమా రావట్లేదని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. లేకపోతే సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ ఊహించారు. చాలామంది కథనాలు కూడా రాశారు. దీనిపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. మేము ఎప్పుడు సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తామని అనౌన్స్ కూడా చేయలేదు మీరే ఊహించుకున్నారు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఆ తర్వాత దేశభక్తికి సంబంధించిన ఎలిమెంట్ ఉంది కాబట్టి రిపబ్లిక్ డే కూడా రిలీజ్ చేస్తారు అని వార్తలు వినిపించాయి. ఫైనల్ గా ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా 100 కోట్లు మార్పు చేరుతుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×