Movie Title: ఎం3మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి(Amardeep Chowdary), నటి సురేఖ వాణీ కూతురు సుప్రీతా నాయుడు(Supritha Naidu) హీరో హీరోయిన్ గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం చౌదరి గారి అబ్బాయితో.. నాయుడుగారి అమ్మాయి(Chowdary Gari Abbayi tho Naidu gari Ammayi). ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.
కులం పేరు పెట్టుకోవడం ఆనవాయితీ…
ఇక ఈ సినిమా టైటిల్ లాంచ్ అనంతరం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమా టైటిల్ గురించి నిర్మాతలకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమా టైటిల్ ఓకే క్యాస్ట్ ను ఉద్దేశించి ఉండటం గమనార్ధం. సినిమా అనేది అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులకు ఒక వినోదం అలాంటిది. ఈ సినిమా టైటిల్ లో కుల ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారు? అంటూ మీడియా వారి నుంచి నిర్మాతకు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు నిర్మాత మాత్రం ఊహించని సమాధానం చెప్పారు. మా సినిమాకు చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అని టైటిల్ పెడితే తప్పేంటండి. మన ప్రాంతంలో పేరు చివరన వారి కులం పేరును పెట్టుకోవడం ఇప్పటికీ పలుచోట్ల ఆనవాయితీగా ఉంది.
రెండు కులాలు కలిస్తేనే కూటమి…
ఇకపోతే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈయన ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఇది నేను కేవలం మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో మాత్రమే చెబుతున్నాను కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ ఈయన తెలిపారు. ఇటీవల ఏపీలో మహాకూటమి ఏర్పాటు అయ్యి ఎన్నికలలో పోటీ చేశారు. ఇక్కడ నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదు.రెండు క్యాస్ట్‌లు కలిసి మనం పోటీ చేస్తూ మహాకూటమిగా ఏర్పడింది. చాలా గౌరవంగా చెబుతున్నా.. వాళ్లు అలా కూటమి అని పెట్టుకొని మంచిగా సక్సెస్ అయ్యారు.. ఇక్కడ మనం ఎవరినీ తప్పుపట్టడానికి ఏం లేదు.. నేను ఒక కులాన్ని ఉద్దేశించి పెట్టలేదని రెండు పదాలు మాత్రమే వాడానని, వాటిని కేవలం పదాలుగా మాత్రమే చూడండి.
సినిమా టైటిల్ లో కులాల ప్రస్తావన అవసరమా..?
రెండు కులాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి కదా అంటూ ప్రొడ్యూసర్ షాకింగ్ ఆన్సర్!#Amardeepchowdary #suprithanaidu #SurekhaVani #AndhraPradesh pic.twitter.com/vauZa1UIMJ
— TeluguOne (@Theteluguone) June 3, 2025
ఇక ఈ కార్యక్రమంలో ముందుగా చౌదరి అని ఎందుకు పెట్టారు?నాయుడు గారి అమ్మాయితో చౌదరి గారి అబ్బాయి అని పెట్టొచ్చుకదా అనే ప్రశ్న కూడా ఎదురయింది. ఈ ప్రశ్నకు నిర్మాత సమాధానం చెబుతూ మీరు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక ఆర్టికల్ రాస్తే అందులో హీరోయిన్, హీరో అని రాస్తారా? లేక హీరో హీరోయిన్ అని రాస్తారా? మీరే సమాధానం చెప్పండి. మీరు రాసేదే నేను అక్కడ పెట్టానని నిర్మాత చెప్పిన ఈ సమాధానం సంచలనంగా మారింది. అయితే ఈయన సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ కూటమి ప్రస్తావన తీసుకురావడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ సినిమాకి క్యాచీగా ఉంటుందని, హైప్ క్రియేట్ చేయొచ్చనే కారణంతోనే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టామని నటుడు అమర్ దీప్ కూడా తెలియజేశారు.