BigTV English

Natti Kumar on R Narayana Murthy : ఆర్ నారాయణ మూర్తి పై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం, ప్రెస్ మీట్ పెట్టించింది వాళ్లే

Natti Kumar on R Narayana Murthy : ఆర్ నారాయణ మూర్తి పై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం, ప్రెస్ మీట్ పెట్టించింది వాళ్లే

Natti Kumar on R Narayana Murthy : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ లపై విప్లవ చిత్రాల నటుడు ఆర్.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను సీనియర్ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” సినిమా విడుదలకు సంబంధించి తలెత్తిన థియేటర్ల వివాదం విషయంపై ఆర్.నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. దీనిపై హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.*


ఈ సందర్భంగా నట్టి కుమార్ స్పందిస్తూ, “ఆర్.నారాయణమూర్తితో నాకు సుదీర్ఘ అనుబంధంతో పాటు పేదల పక్షాన నిలిచే ఆయన అంటే నాకు మొదట్నుంచి ఎంతో గౌరవం ఉంది. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయం నుంచి ఆయన వైఖరిలో పెద్ద మార్పు వచ్చింది.

 


వైసీపీ వాళ్లకు వత్తాసు పలికారు 

వైసీపీ వాళ్లు ఏమి అరాచకాలు చేసినా, సినీ పరిశ్రమకు ఎలాంటి మేలు చేయకపోయినా వారికి వత్తాసు పలుకుతూ వస్తుండటం ఆయనలోని మార్పుని ఎవరికైనా ఇట్లే అర్ధమయ్యేలా చేస్తుంది. గతంలో అప్పటి సీఎం జగన్ సినీ పరిశ్రమ కోసం మీటింగ్ పెట్టినప్పుడు… ఆ మీటింగుకు చిరంజీవి, ప్రభాస్ వంటి పలువురు పెద్ద హీరోలు వెళ్లారు. దానికి ఆర్ . నారాయణమూర్తి వెళ్లారు.

ఆ రోజు చిరంజీవి వంటి పెద్దలను అవమానపరచినపుడు మీరు ఏమి మాట్లాడగలిగారు. ఎప్పట్నుంచో డిమాండ్ ఉన్న చిన్న సినిమాకు ఐదో షో ఇప్పించగలిగారా? జగన్ హయాం కేసిఆర్ హయాంలో వారికి దగ్గరగా ఉన్నప్పుడు మీరెందుకు స్పందించలేదు..”హరి హర వీరమల్లు” సినిమా విడుదల జూన్ 12వ తేదీని ముందుగానే ప్రకటించినప్పుడు, మూడు వారాలు ముందుగా నోటీసు లేకుండా థియేటర్ల బంద్ ఎలా ప్రకటిస్తారు?

ప్రెస్ మీట్ ఎవరు పెట్టించారో నాకు తెలుసు

ఈ విషయం నారాయణమూర్తికి తెలియంది కాదు. కానీ కార్పొరేట్ శక్తుల కుట్ర కోణంలో నారాయణమూర్తి బందీ అయ్యారు. అందుకే వెనకా ముందూ, వాస్తవాలు పట్టించుకోకుండా ఆయన విమర్శలు పవన్ కల్యాణ్, దుర్గేష్ లపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఏ కార్పొరేట్ శక్తులు ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారో నాకు తెలుసు. నారాయణమూర్ధ్ దీనిని ఖండిస్తే, ఆ విషయాలన్నీ నేను బయటపెడతాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో థియేటర్ క్యాంటీన్ల లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు టిక్కెట్ల రేట్ల కంటే ఎంత ఎక్కువగా ఉన్నాయో తెలియంది కాదు. అప్పట్లో ఆ ప్రభుత్వంలో పోసాని కానీ మీలాంటి వాళ్లు కానీ ఏమీ చేయలేకపోయారు, మాట్లడలేకపోయారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఆ సమస్యల గురించి చరిస్తాం, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటే ఆయనను నారాయణమూర్తి విమర్శించడం ఎంతవరకు సమంజసం.

జగన్ చిన్న సినిమాలుకు ఏం చేశారు.?

రాజకీయాలు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు.. థియేటర్ల బంద్ బ్రహ్మాస్త్రం వంటిది. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది. జగన్ చిన్న సినిమాలకు అసలు ఏం చేశారో నారాయణమూర్తి చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మీరు గుత్తాధిపత్యాన్ని ఎందుకు సమర్దిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీ భావాలు మారడమే ఇందుకు నిదర్శనమని అందరూ అంటున్నారు. సమస్యలను తీర్చాల్సింది ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ .కదా! అది కూడా మీకు తెలీదా! ఎందుకు కావాలని పవన్ , దుర్గేష్ లను టార్గెట్ చేశారు. జగన్ ఆ రోజు 5 రూ లకు, 35 రూలకు టికెట్ రేట్లు ప్రకటిస్తే మీరు ఏం చేశారు?

పనికట్టుకొని పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు 

ఇంకొక నిర్మాత, జనసేన నాయకుడు అంటూ ఓ ఎగ్జిబిటర్ గురించి కామెంట్స్ చేశారు. కావాలనే జనసేన పార్టీ పేరు తెస్తున్నారు.. ఆ నలుగురు వల్లే ఎవరికి న్యాయం జరగటం లేదు. ఈ రోజుకు చిన్న సినిమాలకు ఐదో షో రాలేదు.. తెలంగాణా లో భారీ రేట్లకు టిక్కెట్లు, ఫుడ్ అమ్ముతుంటే మీరు ఎందుకు ప్రశ్నించటం లేదు? గత ఐదేళ్లు మీరు ఇండస్ట్రీ ని ఇబ్బంది పెట్టారు.. ఆరోజు మీరు వాళ్లను ఎందుకు అడగలేదు. నిజమైన ఎగ్జిబిటర్ కు నష్ట పోతుంటే మాట్లాడరు. పని కట్టుకుని కూటమీ ప్రభుత్వాన్ని, పవన్ ను విమర్శిస్తున్నారు. ఆ రోజు ఈ రోజు చిన్న సినిమాలకు సపోర్ట్ గా మాట్లాడింది నేనే.” అంటూ ముగించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×