BigTV English

Food Habits to Get Energy : పని చేసి కాసేపటికే అలసిపోతున్నారా.. ? ఎందుకో తెలుసా..

Food Habits to Get Energy : పని చేసి కాసేపటికే అలసిపోతున్నారా.. ? ఎందుకో తెలుసా..

Food Habits to Get Energy : పొద్దంతా ఇంట్లోను, బయట పనులు చేస్తూ అసలిపోతుంటారు. ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. తీరిక లేకుండా ఆఫీసు పనులు లేదా ఇంట్లో ఉండే వారికి వంట పనులు, ఇంటి పనులు అంటూ రకరకాల పనులు ఉంటాయి. అయితే ఇలాంటి తరుణంలో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని సార్లు రోజంతా పనిచేసినా కూడా అస్సలు అలసిపోకుండా చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఏ పని చేసినా కూడా త్వరగా అలసిపోతుంటారు. దీనికి కారణం ఏంటనేది అస్సలు తెలీదు. అయితే పని చేస్తే త్వరగా అలసిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


రోజంతా పని చేయడం వల్ల శరీరంలో శక్తి అంతా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సార్లు కొంచెం పని చేసినా కూడా అలసిపోతుంటాం. అయితే దీనికి కారణం శరీరంలో శక్తి లేకపోవడమే అని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. అంతేకాదు ముఖ్యంగా ప్రోటీన్లు శరీరానికి అందకపోవడం వల్ల శక్తిని కోల్పోతుంది. అందువల్ల తరచూ ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు గుండె బలం పెరగడానికి లేదా రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా శరీరానికి ప్రొటీన్లు అవసరం.

కొన్నిసార్లు తక్కువ కెలరీలతో తీసుకునే ఆహారం వల్ల త్వరగా ఆకలి తీరిపోతుంది. దీని వల్ల తరచూ ఆహారం సరిగా తినకపోవడం వల్ల అధిక బరువు వంటి సమస్యలు ఎదురవుతాయి. దీని కారణంగా శరీరంలో శక్తి తగ్గిపోయి అలసట ఏర్పడుతుంది. శరీరానికి తగిన శక్తి అందాలంటే పాల పదార్థాలు తీసుకోవాలి. పాలలో ఉండే కాల్షియం కండరాలు, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు పాలలో ఉండే ప్రోటీన్లు రక్తపోటు వంటి సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది.


బాదం, అక్రోట్స్, పిస్తా వంటి నట్స్ తినడం వల్ల శరీరానికి తగిన ప్రోటీన్లు అంది శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాదు వీటిని తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మరోవైపు కూరగాయలు, పండ్లు వంటివి తీసుకుంటే కేలరీలు, ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. కొన్ని సార్లు మాంసాహారాలను కూడా తీసుకోవడం వల్ల ప్రోటీన్లు శరీరానికి అంది శక్తివంతంగా మారుస్తాయి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×