Kalki 2 Movie: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas )ఇటీవల నటించిన చిత్రం కల్కి 2898AD. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అటు ప్రభాస్ కి కూడా ఊహించని ఇమేజ్ అందించింది. అంతేకాదు ఈ సినిమాను నిర్మించిన ‘వైజయంతి మూవీస్ బ్యానర్’ కూడా మళ్లీ లైన్ లోకి వచ్చింది అని చెప్పవచ్చు. ఇందులో కమల్ హాసన్(Kamal Hassan),అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తమ పాత్రలకు మించి నటించారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone)అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతోనే తెలుగు సినీ రంగ ప్రవేశం కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ‘మహానటి’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin)ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
IFFI గోవా లో సందడి చేసిన కల్కి నిర్మాతలు..
ఇకపోతే కల్కి(Kalki 2898AD) సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ చిత్ర యూనిట్ పై ఒత్తిడి పెరిగింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ పై అప్డేట్ ఇవ్వడానికి చిత్ర బృందం కూడా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కల్కి2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాతలు అశ్వినీ దత్ (Ashwini Dutt) వారసురాళ్లు అయిన ప్రియాంక దత్(Priyanka Dutt), స్వప్న దత్ (Swapna Dutt) గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరై సందడి చేశారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘కల్కి -2’ పై కామెంట్స్ చేశారు.
కల్కి-2 పై స్వప్న అప్డేట్..
నిర్మాతలు స్వప్న దత్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం కల్కి-2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 35% షూటింగ్ కూడా అయిపోయింది. ఇక దీపికా తో పాటు అన్ని పాత్రలు సీక్వెల్ లో కూడా ఉంటాయి. ఇకపోతే కల్కి పార్ట్ -1 విదేశాల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే అది కూడా పూర్తవుతుంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ఉన్న ‘రాజాసాబ్’ సినిమాతో పాటు ఫౌజీ, స్పిరిట్ సినిమాలు అయ్యాకే కల్కి 2 సినిమా డేట్స్ ఇస్తాడు” అంటూ క్లారిటీ ఇచ్చారు స్వప్న దత్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు అభిమానులలో అంచనాలు పెంచేసాయి.
ప్రభాస్ సినిమాలు..
ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మారుతీ దర్శకత్వంలో చేస్తున్న ‘రాజాసాబ్’ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. అలాగే ‘సీతారామం’ సినిమాతో కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న హను రాఘవపూడి (Hanu raghavapudi)దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా ప్రకటించారు. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హిమాన్వి(Himaanvi )ను హీరోయిన్గా పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాల తర్వాత ‘సలార్ 2’, ‘స్పిరిట్’ చిత్రాలు పూర్తయిన తర్వాతే ‘కల్కి 2’ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలన్నీ పూర్తి అవ్వడానికి మరో రెండేళ్లు పడుతుంది అనడంలో సందేహం లేదు.