E-Paper
Advertisement

Pulkit Samrat – Kriti Kharbanda Wedding: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లికి ప్లేస్ ఫిక్స్.. ఎక్కడంటే..?

Pulkit Samrat – Kriti Kharbanda Wedding: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లికి ప్లేస్ ఫిక్స్.. ఎక్కడంటే..?
Advertisement

Pulkit Samrat – Kriti Kharbanda Wedding: ఢిల్లీ అందం కృతి ఖర్బంద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ హీరో అక్కినేని సుమంత్‌తో ‘బోణీ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘తీన్మార్’ మూవీలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

Advertisement

ఈ మూవీతో కృతి ఖర్బంద సూపర్ డూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక అక్కడ నుంచి ఈ ముద్దుగుమ్మ కెరీర్ మారుతుందనుకుంటే.. ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు సినిమాలకు దూరమై.. నార్త్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ కూడా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ నటుడితో ప్రేమాయణం చేస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్లేస్ కూడా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement

Also Read: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి కర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లి కార్డు వైరల్..

బాలీవుడ్ క్యూట్ లవ్ జంటలలో ఒకరైన పుల్కిత్ సామ్రాట్, కృతి ఖర్బందా ఇప్పుడు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు తమ బంధాన్ని మరో అడుగు ముందుకు వేస్తున్నట్లు సమాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రి పెళ్లి ఎక్కడ జ‌రుగుతుంద‌ని అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెరపడింది. పెళ్లి ఎక్కడ జరుగుతుందనేది తాజాగా ఖరారు అయినట్లు తెలుస్తోంది.

తాజా నివేదిక ప్రకారం.. పుల్కిత్, కృతి ఖర్బంద ‘మనేసర్‌’లోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.

అయితే ఈ జంట ఎటువంటి రిసెప్షన్ నిర్వహించబోవడం లేదని.. కార్యక్రమాలన్నీ మనేసర్‌లోనే జరుగుతాయని టాక్ వినిపిస్తోంది. ఫుక్రే మూవీలోని స్టార్ కాస్ట్‌తో పాటు పుల్కిత్‌కు అత్యంత సన్నిహితులైన సినీ పరిశ్రమకు చెందిన కొందరు కూడా ఈ వివాహానికి హాజరవుతారని తెలుస్తోంది.

Also Read: ఆస్కార్స్‌ సాధించిన సినిమాలు.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

గర్భవతి అయిన రిచా చద్దా కూడా అలీ ఫజల్‌తో వివాహానికి హాజరు కావచ్చని అంటున్నారు. అయితే ఈ ఇద్దరూ ఫక్రే సినిమాలో భాగమైన విషయం తెలిసిందే. కాగా పుల్కిత్ ఇంతకుముందు శ్వేతా రోహిరాను వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ ఇద్దరూ డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయి ఏడాది కూడా పూర్తికాకుండానే పుల్కిత్, శ్వేతా మధ్య సమస్యలు తలెత్తి విడిపోయారు. ఆ తర్వాత కృతి.. పుల్కిత్ జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ లవ్ జంట పెళ్లి చేసుకుని ఎప్పటికీ ఒక్కటిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పుల్కిత్ చివరి చిత్రం ‘ఫుక్రే 3’. ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కాకుండా పుల్కిత్.. జోయా అక్తర్(వెబ్ సిరీస్), మేడ్ ఇన్ హెవెన్ 2 లో కూడా కనిపించాడు. అలాగే కృతి చివరిగా 2021లో విడుదలైన 14 ఫేరే చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రిస్కీ రోమియోలో నటిస్తోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×