E-Paper
Advertisement

Kriti Kharbanda: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి కర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లి కార్డు వైరల్..

Kriti Kharbanda: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి కర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లి కార్డు వైరల్..
Advertisement

Pulkit Samrat - Kriti Kharbanda Wedding

Pulkit Samrat – Kriti Kharbanda Wedding invitation(Tollywood celebrity news): ఢిల్లీ బ్యూటీ కృతి ఖర్బంద గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని సుమంత్‌తో బోణీ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘తీన్మార్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Advertisement

ఈ మూవీతో కృతి ఖర్బందకు చాలా మంచి పేరు, గుర్తింపు లభించింది. అయితే ఈ తీన్మార్ సినిమాతో ఆమె కెరీర్ టర్న్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కృతి తెలుగు సినిమాలకు దూరమైంది. అదే సమయంలో నార్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ కూడా మంచి సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకుంది.

అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో సినిమాలో నటించింది. కానీ కృతి కెరీర్‌కి స్టార్ హీరోయిన్‌ హోదా ఇచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు. ఇక కృతి ఖర్బంద ప్రస్తుతం రిస్కీ రోమియో సినిమా చేయనుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

READ MORE: రెండు ఓటీటీల్లోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

గత కొంత కాలంగా కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్‌తో ప్రేమాయణం చేస్తుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరే ది వెడ్డింగ్, పాగల్ పంతీ, తైష్ సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ దాదాపు 2019 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా పుల్కిత్ సామ్రాట్‌ గతంలో ఒకసారి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 11 నెలలకే ఆమెతో విడిపోయాడు. ఇప్పుడు గత నాలుగేళ్లుగా కృతితోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

ఇక డేటింగ్ న్యూస్‌ని మ్యారేజ్ న్యూస్‌గా మారుస్తూ.. ఇటీవల సామ్రాట్-కృతిల ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. సోషల్ మీడియాలో ఈ జంట ఎంగేజ్మెంట్ ఫోటోస్ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. అయితే ఇప్పుడు ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

READ MORE: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి స్టార్ హీరోల సినిమాలు.. ఇదిగో లిస్ట్

అయితే జంట తమ వివాహ తేదీని అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఈ ఏడాది చివర్లో వారు పెళ్లి చేసుకోబోతున్నారని పలు వార్తలు వైరల్‌గా మారాయి. అయితే వీటన్నింటి మధ్య పుల్కిత్, కృతిల వెడ్డింగ్ ఇన్వెటేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో పుల్కిత్ సామ్రాట్, కృతి ఖర్బందాల జంట బాల్కనీలో కూర్చుని సముద్రాన్ని చూస్తున్నట్లు కనిపిస్తుంది. పుల్కిత్ గిటార్ వాయిస్తుండగా.. కృతి అతనిని తమ పెంపుడు జంతువుతో చూస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం.. ఈ లవ్ కపుల్ మార్చి 13న మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఇండస్ట్రీ నుంచి మరో సెలబ్రెటీ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి కాబోతుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×