BigTV English

Raj Tarun’s Purushothamudu: ‘పురుషోత్తముడు’లో వల్గారిటీ లేదు.. ఆ సీన్సన్నీ కచ్చితంగా మిమ్మల్ని టచ్ చేస్తాయి

Raj Tarun’s Purushothamudu: ‘పురుషోత్తముడు’లో వల్గారిటీ లేదు..  ఆ సీన్సన్నీ కచ్చితంగా మిమ్మల్ని టచ్ చేస్తాయి

Raj Tarun’s Purushothamudu Movie: ఈ నెల 26న ‘పురుషోత్తముడు’ మూవీ రిలీజ్ కాబోతున్నది. టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో శ్రీశ్రీదవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి డా. రమేశ్ తేజావత్ నిర్మతగా పనిచేస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా, హాసినీ సుధీర్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.


ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ భీమన మాట్లాడారు. ‘గతంలో నేను రెండు సినిమాలకు డైరెక్టర్‌గా పనిచేశాను. వాటితో నాకు చాలామంచి పేరు వచ్చింది. ఇటు నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఆరేళ్ల తరువాత మళ్లీ ‘పురుషోత్తముడు’ సినిమాకు దర్శకత్వం వహించాను. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ. ప్రకాశ్ రాజ్, ముఖేష్ ఖన్నా, మురళీ శర్మ, రమ్యకృష్ణ లాంటి పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. వారు అద్భుతంగా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కథను రూపొందించడానికి కారణం ఒక న్యూస్ ఆర్టికల్. దానిని చదివి ఈ స్టోరీ రాశాను. కోటీశ్వరుడైన ఓ యువకుడు పల్లెటూరుకు ఎందుకు రావాల్సి వచ్చింది.. అక్కడ ఏం చేశాడనేది ‘పురుషోత్తముడు’ స్టోరీ. ఇంతవరకు ఏ సినిమాలో లేని అంశాలను మీ ముందు ఉంచబోతున్నాం. ఆ సీన్సన్నీ కచ్చితంగా మిమ్మల్ని టచ్ చేస్తాయి. కథా నాయకనాయికలుగా రాజ్ తరుణ్, హాసినీ సుధీర్.. వారి పూర్తి సపోర్ట్‌ను సినిమాకు అందించారు. ఈ సినిమా చూసిన తరువాత ఎలా ఉందో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను’ అంటూ రామ్ భీమన పేర్కొన్నారు.

అనంతరం నిర్మాత డా. రమేశ్ తేజావత్ మాట్లాడుతూ.. ‘నేను ఆంధ్రా నుంచి ముంబై వెళ్లి చాలారోజులవుతుంది. అక్కడే సెటిల్ అయ్యాను. బిజినెస్‌లో నేను బాగా రాణిస్తున్నాను. అయితే, నాకు సినిమాలంటే చాలా ప్యాషన్. ఒక మంచి తెలుగు సినిమాకు నిర్మాతగా పనిచేయాలనే కోరిక మనసులో ఉండేది. ఆ కోరిక ఇప్పుడు ఈ సినిమాతో తీరిపోయింది. సినిమాలు తీయడమంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా కథాకథనాలు, ఆర్టిస్టుల ఎంపిక, సాహిత్యం, మ్యూజిక్.. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి అంశంపైన పూర్తిగా జాగ్రత్తగా ఉంటూ క్వాలిటీగా ఈ సినిమాను రూపొందించాం. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ కోసమే 6 నెలల సమయం తీసుకున్నామంటే సినిమా క్వాలిటీ కోసం మేం తీసుకున్న జాగ్రత్త ఎంటో మీకే అర్థం అవుతుంది. చంద్రబోస్, చైతన్య ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి వంటి వారి సాహిత్యం ‘పురుషోత్తముడు’ సినిమాకు ఆకర్షణ కానున్నది. సకుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశాం. ఇక నుంచి వరుసగా సినిమాలు తీయాలనుకుంటున్నాం. త్వరలోనే మరో కొత్త సినిమాను ప్రకటిస్తాం’ అని నిర్మాత స్పష్టం చేశారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×