BigTV English

Pushpa 2: పుష్ప అన్న కూతురు పేరు కావేరి అని పెట్టడం వెనుక ఇంత కథ ఉందా.. సుక్కు నీకు దండం అయ్యా..

Pushpa 2: పుష్ప అన్న కూతురు పేరు కావేరి అని పెట్టడం వెనుక ఇంత కథ ఉందా.. సుక్కు నీకు దండం అయ్యా..

Pushpa 2: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో అని చెప్పడం ఎవరి తరం కాదు. ఏ నటీనటులకు అయినా ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా పేరు తీసుకొచ్చిపెడుతుంది. అది  వారిని ఓవర్ నైట్ స్టార్ ను చేసేస్తుంది. అలా ఈ ఏడాది ఓవర్ నైట్ స్టార్స్ గా మారినవారు చాలామంది ఉన్నారు. అందులో నటి పావని కారణం ఒకరు. ఎవరీ పావని అని అనుకుంటున్నారా .. ? పుష్ప 2 లో సినిమా మొత్తాన్ని మార్చేసిన అమ్మాయి కావేరి. ఆమె అసలు పేరే పావని.


అసలు సినిమాలో ఏముందిరా.. ? జాతర సీన్ ఎందుకు వస్తుందిరా.. ?  అని ఆలోచించేవారికి సమాధానమే కావేరి. చిన్నాయన.. చిన్నాయన అంటూ తండ్రిని కాదని పిలిచి ప్రేమ చూపించిన కూతురు కోసమే.. పుష్ప రంగంలోకి దిగుతాడు. మొదటి నుంచి భార్యకు ఇచ్చిన మాట కోసం నిలబడిన పుష్ప.. ఆ తరువాత అన్న కూతురును కాపాడడానికి ఎంతకు తెగించాడు అనేది చూపించారు. ఇక కావేరి పాత్రలో పావని ఒదిగిపోయింది. ఈ సినిమా తరువాత ఆమె కూడా స్టార్ డమ్ ను అందుకుంది.

Keerthy Suresh: పెళ్లి తరువాత కూడా కీర్తి అందాల ఆరబోత.. దాన్ని వేసుకొని కూడా.. ?


పుష్ప 2 హిట్ తరువాత  పావని వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన  సంగతులను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఒక్కో పాత్రను సుకుమార్ మలిచిన విధానం, ఆ పాత్రకు ఎలాంటి పేరు పెట్టాలి అని  ఆలోచించిన విధానం ఆమె చెప్తుంటే.. ఒక డైరెక్టర్ సినిమా కోసం ఇంత ప్రాణం పెడతాడా.. ? అని అనిపించక మానదు. కావేరి పేరు వెనుక పెద్ద కథనే  ఉందని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

” సినిమా మొదలైనప్పటి నుంచి జాతర సీన్ షూటింగ్ చేసేవరకు అందరూ నన్ను పావని  అనే పిలిచేవారు. అప్పటివరకు కూడా నా పాత్రకు పేరు పెట్టలేదు. పావనినే పాత్ర పేరు అనుకున్నారు. సుకుమార్ సర్ కూడా పావనినే అని పిలిచేవారు. జాతర షూటింగ్ సమయంలో పావనినా నీ పేరు  అంటే.. అది నా ఒరిజినల్ పేరు.. పాత్ర పేరు అని చెప్పా. వెంటనే నీ పాత్రకు నామకరణం చేస్తున్నాను. కావేరి అని అన్నారు. దాని వెనుక అర్ధం కూడా ఉంది.

Nandamuri Mokshagna: కల్కి డైరెక్టర్ తో మోక్షజ్ఞ డెబ్యూ.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

కావేరి నది .. అటు తమిళనాడును ఇటు కర్ణాటకను కలుపుతుంది. అలాగే ఇక్కడ నేను అటు పుష్ప కుటుంబాన్ని.. మా కుటుంబాన్ని  కలుపుతాను అని సింబాలిక్ గా ఆ పేరు పెట్టారు” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో సుకుమార్ అనాలసిస్ కు ఫ్యాన్స్ ఫిదా  అవుతున్నారు. ఒక పాత్ర పేరుకే ఇంత ఆలోచించవంటే దండం అయ్యా నీకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×