E-Paper
Advertisement

Pushpa 2: పుష్ప 2 పోస్టర్ కాపీనా.. ఏ సినిమా నుంచి కొట్టేశారు అంటే..?

Pushpa 2: పుష్ప 2 పోస్టర్ కాపీనా.. ఏ సినిమా నుంచి కొట్టేశారు అంటే..?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్‌లను వదులుతూ ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై అద్భుతమైన రెస్పాన్స్‌ క్రియేట్ చేశాయి. కాగా ఈ మూవీని ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు.

Pushpa 2
Pushpa 2

ఈ మేరకు పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి ట్రీట్ అందించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. అంతేకాకుండా కొత్త పోస్టర్‌ను వదిలారు. అందులో అల్లు అర్జున్ గజ్జకట్టిన కాలును చూపించి టీజర్ డేట్‌ను ప్రకటించారు. కాగా ఇప్పుడీ పోస్టర్ కాపీ అని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ కాళ్లకు గజ్జలు కట్టిన ఈ పోస్టర్.. ఇదివరకే రిలీజ్ అయిన ఓ సినిమా పోస్టర్ నుంచి కాపీ కొట్టారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. మొత్తం సినిమాల లిస్ట్ ఇదే

అయితే అది ఏ సినిమా అని అనుకుంటున్నారా?.. తిరువీర్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘భగవంతుడు’ మూవీ. రవి పనస ఫిలిం కార్పోరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మహా శివరాత్రి కానుకగా ఈ మూవీ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ‘భగవంతుడు’ అనే ఒక టైటిల్‌తో.. గజ్జలు కట్టుకున్న ఒక మనిషి కాళ్లని చూపించారు. అయితే ఆ పోస్టర్ ఎంతో క్రియేటివిటీగా ఉండటంతో బాగా వైరల్ అయింది.

pushpa 2

దీంతో ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయిన ఇన్ని రోజులకి పుష్ప 2 పోస్టర్ కూడా సేమ్ అలానే ఉండటంతో చాలామంది ఇది కాపీ పోస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముందుగా ‘భగవంతుడు’ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది కాబట్టి.. పుష్ప 2 మూవీ యూనిట్ ఈ పోస్టర్‌ని కాపీ చేసిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×