Big Stories

DC vs KKR,IPL 2024 Prediction: పంత్ ? శ్రేయాస్? ఎవరు గెలుస్తారు? నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా మధ్య మ్యాచ్

- Advertisement -

DC vs KKR IPL 2024 Complete Analysis: ఐపీఎల్ మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. నేడు విశాఖపట్నంలో జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ మంచి రసవత్తరంగా జరగనుంది. ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ బ్యాటింగ్ టచ్ అందుకున్నాడు. శ్రేయాస్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇకపోతే వీరిద్దరి మధ్యా ఇప్పటివరకు 32 మ్యాచ్ లు జరిగితే ఢిల్లీ 15 మ్యాచ్ ల్లో, కోల్ కతా 16 మ్యాచ్ ల్లో గెలిచి సమఉజ్జీలుగా నిలిచింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది.

- Advertisement -

విశాఖపట్నం గ్రౌండ్ లో ఇప్పటివరకు 14 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 7 సార్లు గెలిస్తే, రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు గెలిచింది. టాస్ గెలిచి విజయం సాధించినవి 7 జట్లయితే, టాస్ ఓడి గెలిచిన జట్లు 7 గా ఉన్నాయి. అందువల్ల రెండు జట్లు కూడా దాదాపు ఒక మ్యాచ్ అటు, ఇటుగా  సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇక్కడ విశాఖ గ్రౌండ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అందువల్ల ఈరోజు మ్యాచ్ మంచి రసవత్తరంగా జరగనుందని అందరూ లెక్కలేస్తున్నారు.

కోల్ కతా రెండు మ్యాచ్ లు నెగ్గి 4 పాయింట్లతో టేబుల్ టాప్ లో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్ లు ఆడి ఒకటి గెలిచి 2 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.

Also Read: మయాంక్ మాయాజాలం.. చిన్నస్వామిలో చిన్నబోయిన బెంగళూరు..

పృథ్వీ షా ఫామ్ లోకి వచ్చాడు. దీంతో ఓపెనింగ్ కష్టాలు తీరిపోయాయి. డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ మంచి ఫామ్లో ఉన్నారు. కెప్టెన్ గా తన మార్క్ చూపిస్తున్నాడు. స్టబ్స్, మార్ష్ క్రీజులో స్టాండ్ అయితే, ఆ టీమ్ను ఆపడం కష్టమే. బౌలింగ్లో ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముఖేష్ రాణిస్తుండటం అదనపు బలం.

ఈ సీజన్లో కోల్కతా మంచి కాక మీద ఉంది. బ్యాటింగ్ టీమ్ బలంగా ఉంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ అద్భుతమైన స్టార్స్ అందిస్తున్నారు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ కూడా ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నారు. బౌలింగ్లో రస్సెల్, హర్షిత్ రాణా ఆకట్టుకుంటున్నారు.

నరైన్ అవసరమైన టైమ్లో బ్రేక్ త్రూకి అందిస్తున్నాడు. బౌలింగ్లో మిచెల్ స్టార్క్ క్లిక్ కావడం లేదు. తను జట్టుకి భారంగా ఉన్నాడు. మొత్తానికి రెండు జట్లలో కూడా బలాబలాలు సమానంగా ఉండటంతో మ్యాచ్ ఇంట్రస్టింగ్ గా మారనుంది.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోకియా, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.

కోల్కతా: ఫిల్ సాల్ట్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్దీప్ సింగ్, అనుకూల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News