Big Stories

Who Will Win In AP Congress : జాబితా ఓకే..! గెలుస్తారా.. చీలుస్తారా?

AP Congress Candidates

- Advertisement -

Who Will Win In AP Congress(Ap News): ఏపీ కాంగ్రెస్‌ లిస్ట్ వచ్చేసింది.. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించేశారు.. 114 అసెంబ్లీ స్థానాలకు, ఐదు లోక్‌సభ స్థానాలకు క్యాండేట్స్‌ను కన్‌ఫామ్ చేశారు.. బాగుంది.. ముందుగానే లిస్ట్‌ను వదిలారు.. కానీ మరి వీరిలో గెలిచేవారెంత మంది? ఎంతమంది నేతలు ప్రజల్లో ఉన్నారు? ఎంతమంది ఇప్పుడే పరిచయం చేసుకుంటున్నారు?  ఏపీ కాంగ్రెస్‌.. రాష్ట్రంలో దాదాపుగా కనుమరుగైందనుకున్న సమయంలో ఓ ఆశాదీపంలా ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల.. పార్టీ పగ్గాలు చేపట్టారు. అటు అధికారపక్షం.. ప్రధాన ప్రతిపక్షంపై విమర్శలు కురిపిస్తున్నారు.. చేరికలు కూడా ఓ మోస్తరుగా జరిగాయి. మొత్తానికి ప్రజల నాలుకలపై కాంగ్రెస్‌ అన్న పదం ప్రస్తుతం ఆడుతోంది.

- Advertisement -

కాంగ్రెస్‌ బతికే ఉందన్న నమ్మకమైతే అటు ఆ పార్టీ నేతలకు, ఇటు ప్రజలకు తెలిసొచ్చింది.. కానీ రాబోయే ఎన్నికల్లో గెలిచి.. అధికార పీఠాన్ని అలంకరించడమే మిగిలిందా? అంటే కాస్త అనుమానంగా ఉంది.. ఎందుకంటే కాంగ్రెస్‌ విడుదల చేసిన లిస్ట్‌లో చాలా మంది కొత్త ఫేస్‌లే కనిపిస్తున్నాయి.. ఎంపీలుగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల, పళ్లంరాజు.. గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, రాంపుల్లయ్య యాదవ్.. ఓకే.. వీళ్లవి ప్రామినెంట్‌ ఫేసేస్‌.. వీళ్లను ప్రజలు గుర్తిస్తారు.. ప్రజల్లో ప్రస్తుతం వీరి బలమెంత అన్నది పక్కన పెడితే.. ప్రజలైతే వారిని గుర్తిస్తారు.

Also Read:పెండింగ్ సీట్లకు ఖరారు.. అభ్యర్థులపై ప్రకటన..!

కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వస్తేనే పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది.. మొత్తం 114 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అభ్యర్థులు ఉన్నారు.. కానీ వీరి మొఖాలు ప్రజలకు కొత్త.. వీరిలో మెజార్టీ అభ్యర్థులు కొత్తగా బరిలోకి దిగుతున్న వారే.. వీరిలో ఎంత మంది ప్రజలను ప్రభావితం చేయగలరు? అనేదే ఇప్పుడు కాస్త గందరగోళంగా ఉంది. మొన్నటి వరకు అసలు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు అన్న ప్రచారం జరిగింది.. కానీ అది కేవలం ప్రచారమని ప్రూవ్ చేస్తూ అభ్యర్థులను ప్రకటించేశారు.. 2019 ఎన్నికలను గమనిస్తే.. 174 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసింది.. అయితే 10 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపింది.
12 నియోజకవర్గాల్లో వెయ్యి లోపు, 100 నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి రెండు వేల లోపు, 40 నియోజకవర్గాల్లో రెండు నుంచి మూడు వేల లోపు ఓట్లు, 14 నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు వేల లోపు ఓట్లు వచ్చాయి.. కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరా రెడ్డి 28 వేల 883 ఓట్లు సంపాదించుకున్నారు. అయినా డిపాజిట్ దక్కలేదు. ఓవరాల్‌గా చూస్తే 174 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కలేదు.

ఈసారి కూడా అదే పరిస్థితి అనుకున్నారు. కానీ ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా షర్మిల ఎంట్రీతో కాస్త పార్టీ పరిస్థితి మారింది.

మారింది కానీ. మరీ అంత మెరుగు పడలేదు.. కాంగ్రెస్‌ జాబితా చూస్తుంటే అదే అర్థమవుతోంది.నిజానికి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ జిల్లాల పర్యటనలతో.. పార్టీ నేతల్లో జోష్‌ నింపే ప్రయత్నమైతే చేశారు షర్మిల.. ఇతర పార్టీల్లో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నారు. వారిలో కొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. కానీ ఆమె ఆశించిన స్థాయిలో చేరికలు మాత్రం జరగలేదు.. ఇప్పుడీ విషయమే కాస్త కలవర పెడుతోంది. కాంగ్రెస్‌ అన్న బ్రాండ్ ఉన్నా.. సరైన లీడర్ లేకపోతే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యమనే చెప్పాలి. ఇప్పుడు ప్రకటించిన లిస్ట్‌లో విజయం సంగతి అటుంచితే.. ఓట్ షేర్ పెంచుకోగలిగినా, వచ్చే ఎన్నికలకు బూస్ట్ దొరికినట్లవుతుంది.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News