Pushpa 2 Trailer 24 hours :2021 డిసెంబర్ 17 తేదీన పాన్ ఇండియా సినిమాగా విడుదలైన చిత్రం పుష్ప(Pushpa). అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar ), రష్మిక మందన్న (Rashmika mandanna)కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం నార్త్ లో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత(Samantha )తొలిసారి ఐటమ్ సాంగ్ చేసి అందరిని అబ్బురపరిచింది. ముఖ్యంగా ఇందులో “ఊ అంటావా ఉ ఊ అంటావా” పాట ఆడియన్స్ లో సరికొత్త జోష్ నింపింది. ఇప్పటికీ కూడా ఈ పాట ట్రెండింగ్ లో ఉందంటే అతిశయోక్తి కాదు. దాదాపు మూడేళ్ల నిర్విరామ శ్రమ తర్వాత పుష్ప సీక్వెల్ పుష్ప -2 2024 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
దిగ్గజ దర్శకుల ప్రశంసలు..
ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుంచి నిన్న (నవంబర్ 17 ) ట్రైలర్ లాంచ్ చేశారు. అలా రిలీజ్ అయిందో లేదో ఈ ట్రైలర్ పై పలువురు స్టార్ సెలబ్రిటీలు, దర్శకులు, హీరోలు, నిర్మాతలు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ ను కొనియాడారు అంటే ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’, ప్రభాస్(Prabhas ) ‘సలార్’ సినిమా ట్రైలర్లు సాధించిన రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ.. ఆల్ టైం రికార్డ్ సృష్టించింది పుష్ప-2 ట్రైలర్ (Pushpa2 Trailer).ఇకపోతే భాషలవారీగా ఈ ట్రైలర్ ఎన్ని వ్యూస్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం…
24 గంటల్లో దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో పుష్ప 2 ట్రైలర్ కి 105.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
తెలుగు – 44.8 మిలియన్ వ్యూస్..
హిందీ – 51 మిలియన్ వ్యూస్..
తమిళ్ – 5.3 మిలియన్ వ్యూస్..
మలయాళ – 1.9 మిలియన్ వ్యూస్..
కన్నడ – 1.9 మిలియన్ వ్యూస్..
బెంగాలీ – 1 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇలా మొత్తానికైతే అన్ని భాషలలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా.
ట్రైలర్ విశేషాలు..
ట్రైలర్ విషయానికి వస్తే.. ముఖ్యంగా ఇందులో ఎన్నో అంశాలు ఆడియన్స్ ను కట్టిపడేసాయి. పుష్ప-2లో జగపతిబాబు(Jagapathi babu)నటించారు. అంతేకాదు ఇందులో అరగుండు గెటప్ తో, మెడలో చెప్పులు వేసుకొని, కిల్లింగ్ స్మైల్ ఇస్తూ నడుస్తూ వచ్చిన క్యారెక్టర్ అందరిని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ‘కేజిఎఫ్ -2’, ‘దేవర’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్ పొన్నప్ప(Tarak ponnappa)ఈ పాత్ర పోషించారు. ఇక అలాగే రష్మిక, అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ భారీగా వర్కౌట్ అయ్యింది. ముఖ్యంగా ఆమె కాలితో ‘తగ్గేదేలే’ సిగ్నేచర్ డైలాగ్ చెప్పించడం మరో లెవెల్. అంతేకాదు ఇక్కడ ఒక షాట్ లో ఎర్రచందనంతో శవాన్ని కాల్చడం చూపిస్తారు. మరి ఆ శవం ఎవరిది?అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయగా.. అది ఎర్రచందనం కింగ్ పుష్పరాజ్ భార్య శ్రీవల్లిది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తానికైతే ప్రతి ఒక్క షాట్ తో ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సినిమాపై హైప్ పెంచారు చిత్ర బృందం.