Best Mutual Funds Scheme: డబ్బులు చాలా మంది సంపాదిస్తుంటారు. కానీ సంపాదించిన డబ్బులను ఖర్చు చేయకుండా పొదుపు చేసిన వారే ధనవంతులు అవుతారు. వారికి భవిష్యత్ లో ఎలాంటి కష్టాలూ రాకుండా ఉంటాయి. డబ్బులను ఎక్కడ ఎలా పొదుపు చేయాలి అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ల విషయంలో అవగాహన, మంచి ప్రణాళిక ఉండాలి. డబ్బులను రెట్టింపు చేసుకునేందుకు స్టాక్ మార్కెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ బాండ్లు ఇలా కొన్ని అవకాశాలు ఉంటాయి. అయితే వీటి కంటే ఎక్కడ లాభం వచ్చేది మాత్రం మ్యూచువల్ ఫండ్లతోనే.
Also read: దువ్వాడపై ఫిర్యాదు.. టెక్కలిలో కేసు నమోదు.. దివ్వెల మాధురి రియాక్షన్?
మ్యూచువల్ ఫండ్స్ కూడా కాస్త రిస్క్ అయినప్పటికీ ధీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ రికార్డులు చెబుతున్నాయి. మంచి స్కీమ్ ఎంచుకుని డబ్బులు కడితే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఆ డబ్బులు ఎలాంటి స్టాక్స్ లో పెట్టుబడి పెడతారనేది మనం ముందే తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ చాలా మంది ఎంపిక. చాలా మంది ఆర్థిక నిపుణులు సిప్ లోనే డబ్బులు సేవ్ చేయాలని సూచిస్తున్నారు. సిప్ లో మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ తోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా తక్కువ మొత్తం నుండి సేవింగ్స్ చేసుకునే వెసులుబాటు ఉండటం గొప్ప విషయం.
అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ (చక్రవడ్డీ) గురించి తెలుసుకుంటే మంచిది. ప్రారంభంలో డబ్బులు తక్కువ వచ్చినా కాలం గడుస్తున్న కొద్దీ పెట్టుబడిపై వడ్డీ, చక్రవడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లలో హెచ్ డీఎఫ్సీ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. ఇందులో ప్రతినెల రూ.1000 సిప్ చేస్తే 28 ఏళ్లలో కోటీశ్వరులు అవుతారు. 1996లో ఈ స్కీమ్ ప్రారంభించగా అప్పటి నుండి రూ.1000 సిప్ చేసిన వారికి వార్షిక ప్రాతిపదికన సగటున 22.89 శాతం ఇస్తారు. అప్పుడు సిప్ చేసిన వారికి ఇప్పుడు రూ.1.9 కోట్లు వస్తాయి. కాబట్టి తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే కోట్లలో డబ్బులు పొందవచ్చు.