Pushpa 2 Trailer Review: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప 2 (Pushpa-2). ఇకపోతే దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా ఒకే సినిమా కోసం తన సమయాన్ని కేటాయించిన బన్నీ, ఎట్టకేలకు ఈ సినిమాతో మరో రేంజ్ అందుకోబోతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. బీహార్ లోని పాట్నాలో గాంధీ మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ లో పలువురు సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ.. సినిమా కోసం కష్టపడ్డ బృందంపై ప్రశంసలు కురిపించారు.
ఇకపోతే తాజాగా పుష్ప -2 ట్రైలర్ విడుదల అయింది. 2 సెకండ్ల 44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ ఇరగదీసాడని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ట్రైలర్ లో కొన్ని అంశాలు ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
పుష్ప సినిమాలో కనిపించని జగపతిబాబు.. పుష్ప -2 లో కనిపించడం హైలెట్ గా నిలిచింది. ఇక్కడ సరికొత్త గెటప్ లో అందరిని ఆకట్టుకున్నారు.
స్టార్టింగ్ నుంచి చెబుతున్నట్టుగానే గంగమ్మ జాతర సినిమాకే హైలెట్ గా నిలవనుంది. ట్రైలర్లో కూడా జాతర విజువల్స్ ను కంటికి కట్టినట్టుగా చూపించారు.
సముద్రంలో ఫైట్ సీన్స్ మరింత ఆసక్తిని కలిగించాయి.
అంతేకాదు శ్రీవల్లి – పుష్ప మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ హైలెట్ అయినా అంశం ఏమిటంటే.. శ్రీవల్లి కాలితో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ సిగ్నేచర్ డైలాగ్ చూపించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అన్నిటికంటే ముఖ్యంగా సగం గుండుతో విచిత్రమైన గెటప్ లో ఒక వ్యక్తి కనిపించి, అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఆ గెటప్ లో నటించింది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులలో తలెత్తుతోంది.
అలాగే అనసూయ , సునీల్ క్యారెక్టర్లు ఎప్పటిలాగే ఆకట్టుకున్నాయి.
డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి.
అల్లు అర్జున్ గజ్జ కట్టి గంగమ్మ జాతరలో డాన్స్ వేయడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఇక శ్రీ లీల హై ఎనర్జిటిక్ తో స్పెషల్ సాంగ్ లో అలరించబోతోందని ఈ ట్రైలర్ లో చూపించారు.
హై ఎండ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ ని నింపేశారు.
చివర్లో పుష్ప గెటప్స్ , మాస్ లుక్ అభిమానులలో మాస్ జోష్ నింపాయని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది అనడంలో సందేహం లేదు.
పుష్ప -2..
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటుడిగా కూడా రికార్డు సృష్టించారు. ఇప్పుడు పుష్ప -2 తో మరో రికార్డ్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు.