అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప-2 (Pushpa-2). భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ కోసం అభిమానులు, సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురు చూశారు. అందరి ఎదురుచూపుకి తెర దింపుతూ.. నవంబర్ 17 ఆదివారం సాయంత్రం అనగా ఈరోజు.. కొద్దిసేపటి క్రితం బీహార్ రాజధాని పాట్నాలో చాలా గ్రాండ్ గా ఈవెంట్ ఏర్పాటుచేసి, ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉండగా.. ఈ ట్రైలర్ పై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎక్స్ ద్వారా పోస్ట్ చేస్తూ.. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మరి పుష్ప -2 ట్రైలర్ పై ఆయన అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్ ఒక మాస్ కింగ్..
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానం వేదికగా పుష్ప -2 ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. 2 నిమిషాల 44 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “పుష్ప -2 ట్రైలర్ నిజంగా మాస్టర్ పీస్. అల్లు అర్జున్ మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. 100% తన బెస్ట్ అందించాడు. బన్నీ ఆటిట్యూడ్, స్టైల్, పెర్ఫార్మన్స్ అన్నీ కూడా అద్భుతం. ఆయనలా మరొకరు చేయలేరు. నిజంగా అల్లు అర్జున్ ఒక మాస్ కింగ్ అని చెప్పడంలో సందేహం లేదు” అంటూ బన్నీని ఆకాశానికి ఎత్తేస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
బండ్లన్న పై బన్నీ ఫ్యాన్స్ ప్రశంస..
బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.అంతేకాదు బన్నీ అభిమానులు బండ్ల గణేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఒక స్టార్ నిర్మాత అయ్యుండి , ఈయన సినిమా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారంటే.. ఇక సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
పుష్ప -2 సినిమా విశేషాలు..
ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna)హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో సమంత (Samantha ) మెరవగా.. ఇప్పుడు సీక్వెల్లో శ్రీ లీల (Sreeleela) తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోతోంది. అలాగే ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ తో అభిమానుల అంచనాలు మరో లెవెల్ కి వెళ్ళిపోయాయని చెప్పవచ్చు. ఇక ఇందులో అల్లు అర్జున్ నిజంగానే తన అద్భుతమైన మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో ఇరగదీసాడు. ఇకపోతే బన్నీ మాసివ్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది అనడంలో సందేహం లేదు.