BigTV English
Advertisement

Pushpa-2 : పుష్ప-2 టీజర్ రెడీ..? బన్నీ ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్.!

Pushpa-2 : పుష్ప-2 టీజర్ రెడీ..? బన్నీ  ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్.!

Pushpa-2 : అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. ఈ మూవీ బిగ్ హిట్ తో ఐకాన్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో చాలామంది రాజకీయ నాయకులు పుష్ప మూవీలోని డైలాగ్ తో ప్రత్యర్థులకు సవాళ్లు విసిరారు.


కొందమంది క్రికెటర్లు తగ్గేదేలేదంటూ పుష్ప డైలాగ్ కు యాక్షన్ చేసి చూపించారు. ఇలా పుష్ప క్రేజ్ విశ్వవ్యాప్తమైంది. ఈ మూవీలో పాటలు అదిరిపోయాయి. అల్లు అర్జున్ ను అనుకరిస్తూ ఫ్యాన్స్ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. విదేశీయులు పుష్ప పాటలకు స్టెప్స్ వేసి అదుర్స్ అనిపించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా పుష్ప మూవీకి క్రేజ్ వచ్చింది.

పుష్ప హిట్ తో ఈ సినిమా స్వీకెల్ పై భారీ అంచనాలున్నాయి. పుష్ప -2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే చిత్రబృందం ఈ మూవీకి సంబంధించి మేజర్‌ అప్‌డేట్‌ అధికారికంగా వెల్లడించలేదు. కానీ అల్లు అర్జున్‌ పుట్టిన రోజు నాడు పుష్ప-2 టీజర్‌ రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్‌ 8న 3 నిమిషాల టీజర్‌ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ టీజర్ లో పూర్తిగా యాక్షన్‌ సీన్స్ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప-2 పోస్టర్‌ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.


మరోవైపు పుష్ప-2 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్ర దర్శకుడు సుకుమార్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పుష్ప-2పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. ఈ మూవీలో డైలాగ్స్ ట్రెండ్‌ సృష్టిస్తాయని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. మరి ఏప్రిల్ 8న పుష్ప-2 టీజర్ రిలీజ్ చేసి బన్నీ ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారా..?

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×