Pushpa 2 Tragedy:పుష్ప 2 (Pushpa 2).. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత అటు హిట్ టాక్ తో ఇటు కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంటే, మరికొంతమంది జీవితాలలో విషాద ఛాయలు మిగిల్చింది. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులను బలి తీసుకుందనే వార్తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే రేవతి(Revathi)అనే 39 ఏళ్ల మహిళ బెనిఫిట్ షో సమయంలో తుది శ్వాస విడవగా.. ఇప్పుడు మరో విషాదం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సినిమా చూస్తూ అభిమాని మృతి..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం లో ఉన్న ఒక థియేటర్లో పుష్ప -2 సినిమా చూస్తూ మద్దానప్ప అనే 37 ఏళ్ల అభిమాని కన్నుమూశారు. థియేటర్లో పుష్ప 2 సినిమా షో ముగిసిన తర్వాత కూడా అతను సీటులోనే కూర్చుని ఉండడంతో ప్రేక్షకులకు అనుమానం వచ్చింది. వెంటనే థియేటర్ యాజమాన్యానికి ఈ విషయాన్ని తెలిపారు..ఆ తర్వాత అతడు మరణించినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కూడా కేసు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాదాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బెనిఫిట్ షో సమయంలో మహిళా మృతి..
ఇదిలా ఉండగా డిసెంబర్ 4 అర్థరాత్రి హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెన్ఫిట్ షో చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే అభిమానులతో సినిమా చూడడానికి ఆ సినిమా హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కూడా ఎటువంటి సెక్యూరిటీ, ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా రావడంతో అభిమాన హీరోని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. తొక్కిసలాట జరగగా.. ఆ తొక్కిసలాటలో 39 ఏళ్ల రేవతి అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు స్పృహ తప్పి పడిపోయారు. ఇక సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించి ,మెరుగైన వైద్య చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచివేసింది. ఇక ఇప్పుడు ఈ బాధ నుంచి బయటపడే లోపే మరో ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ యువకుడి మరణ వార్త అల్లు అర్జున్ వరకు వెళ్తుందా..? వెళ్తే ఆయన సత్వర నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2 సినిమా..
అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం పుష్ప.ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 డిసెంబర్ 5న విడుదలైంది. విడుదలైన మొదటి రోజే రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అంతే కాదు ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోతుందని అంచనాలు కూడా వేస్తున్నారు.
పుష్ప- 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. తాజాగా ఏపీలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గ్‌లోని కేబీ ప్యాలెస్ థియేటర్లో ఈ విషాదం చోటు చేసుకుంది.… pic.twitter.com/KdjrODhqsE— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024