Manchu Manoj First Reaction : మంచు మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీలో గత రెండు రోజుల నుంచి జరుగుతున్న గొడవ తెలుగు చిత్ర సీమలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆస్తి వివాదంలో తండ్రి కొడుకులు మంచు మనోజ్ Manchu Manoj), మోహన్ బాబు రచ్చకెక్కడం, ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ గొడవల గురించి స్పందించారు.
అసలు వివాదం ఏంటంటే… మోహన్ బాబు (Mohan Babu) యూనివర్సిటీ, మోహన్ బాబు విద్యానికేతన్ లాంటి విద్యా సంస్థలలో ఆర్థికపరమైన అవకతవకలు ఏర్పడ్డాయని, ఆ విషయాన్ని ప్రశ్నించడం వల్ల మనోజ్ పై దాడి చేశారని టాక్ నడుస్తోంది. తన తండ్రి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పిల్లల చదువుకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని గతంలోనే మంచి మనోజ్ కామెంట్స్ చేసిన విషయం విధితమే. అయితే బాధిత పిల్లల తల్లిదండ్రులకు మనోజ్ అండగా నిలవడం వల్లే అతనిపై దాడి చేశారని అంటున్నారు. గతంలోనే ఇలాంటి వివాదాన్ని మంచు మనోజ్ తెరపైకి తీసుకొని వచ్చినప్పటికీ అప్పట్లో ఈ విషయం పెద్దగా వివాదాస్పదం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆస్తులు పంపకాల విషయంలో గొడవలు అంటూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి ముంబైలో ఉన్న మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ ఇంటికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అదే టైంలో మోహన్ బాబు ఇంటి వద్ద మనోజ్ కు సంబంధించిన 30 మంది బౌన్సర్లు, విష్ణుకు సంబంధించిన 40 మంది బౌన్సర్లు ఉండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇక తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆయన ఇంటికి చేరుకునే గ్యాప్ లోనే మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు నమోదు చేసుకున్నారు. మోహన్ బాబు తనకు మంచు మనోజ్, మౌనికల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నిన్న రాత్రి 11 గంటలకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు మనోజ్ మాత్రం మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే ఈ కేసులో మంచి మనోజ్ తన ఫ్యామిలీపై ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఈ వివాదంపై మంచు మోహన్ బాబు స్పందిస్తూ ‘అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు కామన్. గతంలో ఇలాంటి గొడవలు చాలానే జరిగాయి. ఎన్నో సమస్యలు కూడా వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కరించాను.. మళ్లీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసేలా చేశాను” అంటూ కామెంట్ చేశారు. పహాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకున్న తరుణంలో ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం.
మరోవైపు మంచు మనోజ్ (Manchu Manoj) స్పందిస్తూ “నేను డబ్బు కోసం, ఆస్తి కోసం కాదు.. ఆత్మ గౌరవం కోసం ఈ పోరాటం చేస్తున్నా. నా బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు దాడి చేశారు. నా భార్య పిల్లలకు రక్షణ లేదు. నాకు న్యాయం జరగడం లేదు. పోలీసులు కూడా ఏకపక్షంగా ఉంటున్నారు. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. అందరినీ కలుస్తూనే ఉంటా” అని చెప్పుకొచ్చారు.
ఆస్తి కోసమో డబ్బు కోసమో నేను ఈ పోరాటం చేయడం లేదు : మంచు మనోజ్
ఆత్మగౌరవం కోసం, నా భార్య, పిల్లల రక్షణ కోసం చేస్తున్న పోరాటం
రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోయారు
నన్ను తొక్కేయడానికి నా భార్య, పిల్లలను లాగుతున్నారు
పోలీసులు వన్ సైడెడ్ గా వ్యవహరిస్తున్నారు
– మీడియాతో మంచు… pic.twitter.com/d7uNOnoMMN
— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024