E-Paper
Advertisement

Pushpa 2: సుకుమార్ తీరుకు బన్నీ అసహనం.. ఈసారి కూడా పుష్ప లేనట్టే..?

Pushpa 2: సుకుమార్  తీరుకు బన్నీ అసహనం.. ఈసారి కూడా పుష్ప లేనట్టే..?
Advertisement

Pushpa 2: పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ఈ సినిమా తరువాత మరో సినిమాను ముట్టుకోకుండా గత రెండేళ్లుగా పుష్ప 2 కోసం కష్టపడుతున్నాడు. ఇంకోపక్క సుకుమార్ సైతం ఒక శిల్పాన్ని చెక్కినట్లు పుష్ప 2 ను చెక్కుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు.. హైప్ కూడా క్రియేట్ చేసాయి.

అన్ని బావుంటే ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, షూటింగ్ ఇంకా ఉండడంతో ఆ రిలీజ్ డేట్ ను మార్చేశారు. ఆగస్టు నుంచి డిసెంబర్ కు పుష్ప 2 వాయిదా పడింది. అయితే ఈ లోపే డైరెక్టర్ సుకుమార్ కు.. హీరో అల్లు అర్జున్ కు మధ్య విబేధాలు తలెత్తాయని టాక్ నడుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2.. ఇంకా 30 రోజుల షెడ్యూల్ ఉంది. ఇప్పటివరకు కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టింది లేదు.

Advertisement

ఒకసారి బన్నీ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లి వచ్చాడు. ఈ సినిమా కోసం పెంచుతున్న గడ్డాన్ని ట్రిమ్ చేశాడు. దీంతో మళ్లీ అది పెరిగే వరకు షూట్ లేదు అని టాక్. ఇంకోపక్క సుకుమార్ వ్యవహారం ఏమి బాలేదని సమాచారం. ఎక్కడైనా నటీనటుల తీరు బాగోక షూటింగ్ క్యాన్సిల్ అవుతోంది. కానీ, ఇక్కడ సుకుమార్ తీరు బాలేదని అంటున్నారు. రేపు షూటింగ్ ఉంటే ఈరోజు నైట్ ఫోన్ చేసి క్యాన్సిల్ అని చెప్తున్నాడట.. చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేస్తున్నాడట.

ఒకసారి బన్నీ అమెరికాలో ఉంటే.. ఇంకోసారి సుకుమార్ ఉంటున్నాడ. అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. తిప్పి తిప్పి కొడితే డిసెంబర్ కు నాలుగు నెలలు కూడా లేదు. షూటింగ్ ను ఫినిష్ చేయాలి.. అది కూడా సుకుమార్ లాంటి పర్ఫెక్ట్ డైరెక్టర్ కాబట్టి.. మినిమమ్ లో మినిమమ్ 30 రోజుల షూట్ అంటే 2 నెలలు అటే పోతాయి.

Advertisement

ఇక పాస్ట్ ప్రొడక్షన్ పనులు.. సెన్సార్ పనులు.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ మరో ఎత్తు. ఇవన్నీ సకాలంలో జరిగితేనే డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్. ఇది కూడా మిస్ అయితే.. నెక్స్ట్ ఇయరే. ఇంకోపక్క సుకుమార్ తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేస్తున్నాడట. పుష్ప 2 వలనే.. అట్లీ సినిమాను కాదనుకున్నాడట బన్నీ. ఇటు ఈ సినిమా అవ్వకుండా.. ఇంకో సినిమాను మొదలుపెట్టడం వీలు కాదు. అలా అటుఇటు కాకుండా బన్నీ లాక్ అయ్యాడట. బన్నీకి రాత్రి పగలు అనే తేడాలేదు. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు. కానీ, సుకుమార్ ఆ దిశగా దృష్టే పెట్టడం లేదని, దీనికే బన్నీకి లోపల లోపల కోపం పెరిగిపోతుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ అయినా నోరు విప్పాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×