BigTV English

Pushpa2 Collections : దంగల్ కి పోటీగా పుష్ప రాజ్..   ఎక్కడా తగ్గేదేలే.. ఎన్ని కోట్లంటే..?

Pushpa2 Collections : దంగల్ కి పోటీగా పుష్ప రాజ్..   ఎక్కడా తగ్గేదేలే.. ఎన్ని కోట్లంటే..?

Pushpa2 Collections : టాలీవుడ్ హీరో అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం పుష్ప 2.. ఒకవైపు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. భారీ అంచనాలతో విడుదలై రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ వసూళ్ల సునామి సృష్టిస్తుంది. అల్లు అర్జున్, సుక్కు కాంబోలో గతంలో వచ్చిన పుష్ప రికార్డులను క్రాస్ చేసింది. ఒక్క ఏరియాలోనే కాదు. అన్ని ఏరియాలో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. పుష్ప 2 థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు అవుతున్న కూడా కలెక్షన్స్ తగ్గలేదు అదే జోష్ లో కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే తన పేరిట అనేక రికార్డులను నెలకొల్పుతున్నాడు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో నిలిచిన పుష్ప 2 .. రూ. 2000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.. ఇక 22 రోజులకు పుష్ప రాజ్ ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..


దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా పుష్ప రాజ్ మేనియాలో పడిపోయారు. క్రికెటర్లు, సెలబ్రెటీలు పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. అంతగా మూవీ జనాలకు ఎక్కేసింది. ఇక ఈ మూవీకి కలెక్షన్స్ అతి త్వరలోనే హిందీలో రికార్డులు క్రియేట్ చేసిన దంగల్ మూవీ కలెక్షన్స్ ను అతి త్వరలోనే బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ను చూస్తే.. క్రిస్మస్ సెలవులు కావడంతో పుష్ప 2కి బాగా కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం 21 రోజుల్లోనే రూ.1705 కోట్ల వసూళ్లు సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఒక్క హిందీలోనే ఏకంగా రూ. 800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది పుష్ప 2.. 22 వ రోజు కూడా కలెక్షన్స్ తగ్గలేదు. 1719 కోట్లు వసూల్ చేసింది. ఇక 23 వ రోజుకు గాను 1743 కోట్లు వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా నేపాల్లోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుండటం విశేషం. కేవలం రూ. 20 రోజుల్లో రూ. 24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ‘హయ్యస్ట్ గ్రాసింగ్ ఫారెన్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ నేపాల్’ రికార్డును సాధించింది ‘పుష్ప 2’.. మొత్తానికి తెలుగు రాష్ట్రలతో పాటుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ రికార్డులను సొంతం చేసుకుంది.. ఒకవైపు వివాదాలు వినిపిస్తున్నా సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక ఈ మూవీ ఓటీటి డేట్ కూడా లాక్ చేసుకుంది. మరి అక్కడ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×