Anasuya Bharadwaj : ఒకప్పుడు బుల్లి తెర పై స్టార్ యాంకర్ గా వరుస షోలతో బిజీగా ఉన్న యాంకర్లలో ఒకరు అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం ఈమె సినిమాలతో బిజీగా ఉంది. చాలా తక్కువ సమయంలోనే ఈమె ఈ క్రేజ్ దక్కించుకున్నారు. హీరోయిన్లను మించిన అందంతో యువతలో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు అనసూయ.. ఈమె చేస్తున్న షోలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు రావడంతో యాంకరింగ్ కు గ్యాప్ ఇచ్చింది.. వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా పుష్ప 2 మూవీలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు.. ఇక ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కూడా మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్ కు షాకింగ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది..
బుల్లి తెర పై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ షోకు ఈమె గతంలో యాంకర్ గా వ్యవహారించారు. ఆ షో అమ్మడు జీవితాన్నే మార్చేసింది. సినిమాల్లో వరుసగా ఆఫర్స్ పలకరించాయి.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఆమెలోని నటిని బయటపెట్టింది. రంగస్థలం తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తూ దున్నేస్తున్న కాలంలో వారి జోరుకు బ్రేకులు వేశారు రంగమ్మత్త. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తన గ్లామర్ షోతో ఆ సినిమాలకు భారీ హైప్ తీసుకొచ్చారు అనసూయ.. రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పుష్ప 2 విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది..
ఇక సినిమాల్లో గ్యాప్ దొరికినప్పుడల్లా వరుసగా వేకెషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆమె వేకెషన్స్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అను ఏ ఫోటో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతాయి. ఇంట్లో పండుగలు, నోములు, ఇతర శుభకార్యాలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ మిస్ కారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా రెండింటికి సమయాన్ని కేటాయించి గృహిణిగానూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న అనసూయ జబర్దస్త్ ను వదిలెయ్యడానికి అసలు కారణాలు తెలియదు.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చెయ్యడంతో పాటుగా అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. జబర్దస్త్ షో ఎందుకు వదిలేసారు అంటూ ఇప్పటికి ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు. తాజాగా ఓ నెటిజన్ జబర్దస్త్‌లోని ఓ క్లిప్‌ను షేర్ చేస్తూ మిస్ అనసూయ మేడం అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన ఆమె అయ్యో నేను ఎక్కడికి పోలేదండి అంటూ రిప్లయ్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ పోస్ట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టారు ఈ జబర్దస్త్ యాంకర్.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.