OTT Movie : ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు చక్కటి కథతో తెర ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఓటిటి ప్లాట్ లోకి స్ట్రీమింగ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. మీరాజాస్మిన్ నటించిన ఒక రొమాంటిక్ కామెడీ మలయాళం మూవీ, థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ కాబోతోంది? తెలుసుకుందాం పదండి.
సైనా ప్లే (Saina Play)
ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘పాలుమ్ పాజవుమ్‘ (Paalum Pazhavum). ఈ మూవీకి వికే ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ సైనా ప్లే (Saina Play) లో త్వరలో స్ట్రీమింగ్ కు రాబోతుంది. రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామనీ సైనా ప్లే ప్రకటించింది. పాలుమ్ పాళవుమ్ మూవీలో అశ్విన్ జోష్ హీరోగా నటించాడు. మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించింది. శాంతికృష్ణ, అశోకన్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ కుటుంబంలోని కొన్ని పరిస్థితుల కారణంగా పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తుంది. చివరికి హీరోయిన్ కు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. అయితే అదే ఊర్లో పని పాట లేకుండా తిరిగే సునీల్ అనే వ్యక్తిని సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ ప్రేమిస్తుంది. అయితే ఇద్దరి మధ్య వయసు 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. హీరోయిన్ సునీల్ కన్నా పది సంవత్సరాలు పెద్దది కావడంతో వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. సమాజంలో కూడా వీరికి ప్రతికూల పరిస్తితులు ఎదురౌతాయి. అయితే మరోవైపు సునీల్ ఈజీగా డబ్బులు సంపాదించి ఎదగాలని చూస్తూ ఉంటాడు. వీరిద్దరూ ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. సమాజంలో వీళ్ళకి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా? పెళ్లి తర్వాత వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే సైనాప్లే (Saina Play) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ‘పాలుమ్ పాజవుమ్’ (Paalum Pazhavum) మూవీని తప్పకుండా చూడండి. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో థియేటర్లలో రిలీజైన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. మీరాజాస్మిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో టాప్ హీరోలతో కలసి హీరోయిన్ గా నటించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమై దుబాయ్ లో సెటిల్ అయిన మీరాజాస్మిన్, ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలలో బిజీ అవుతుంది. తెలుగులో స్వాగ్ మూవీలో మెరిసింది. ఆ తరువాత తమిళంలో ది టెస్ట్ మూవీలో నటిస్తోంది. మరిన్ని సినిమలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.