BigTV English

Raja Saab : ‘రాజా సాబ్ ‘ సాలిడ్ అప్డేట్..అప్పుడైన పక్కా వస్తుందా..?

Raja Saab :  ‘రాజా సాబ్ ‘ సాలిడ్ అప్డేట్..అప్పుడైన పక్కా వస్తుందా..?

Raja Saab : ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కేవలం పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా విడుదల తేదీ పై క్లారిటీ రాలేదు. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయి ఉండాలి.. కానీ షూటింగ్ పెండింగ్ ఉండటం తో వాయిదా పడింది. ప్రస్తుతం మరో రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆ డేట్ అయిన ఫిక్స్ అవుతుందా? మళ్లీ మారుస్తారా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు..


రాజా సాబ్ అప్డేట్..

ప్రభాస్ నుంచి వస్తున్న హారర్ సినిమా కావడంతో ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని జులై 18న రిలీజ్ చేయనున్నారంటూ ప్రచారం జరిగినా అది కష్టమేనని తేలిపోయింది. ఇప్పుడు అది కాస్త సెప్టెంబర్ కు షిఫ్ట్ అయ్యింది. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చే అవకాశముందని దాని సారాంశం. అంతేకాదు ఎండలతో మండిపోయే మే నెలలో రెబల్ ఫ్యాన్స్‌ని కూల్ చేయడానికి టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.. ఈ మూవీలో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీఎఫెక్స్ పై సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి ఈ టీజర్ తో ఈ మూవీ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.


Also Read : ఆ హీరోతో నా పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ..

షూటింగ్ పెండింగ్ పై చర్చ..

ఈ సినిమా షూటింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ మధ్య ప్రభాస్ కు సర్జరీ జరగడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. షూటింగ్ పార్ట్ కొంతమేర పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని పాటలతో పాటు క్లైమాక్స్ కూడా కొన్ని సీన్లు షూట్ చేయాలంట. ఈ క్రమంలోనే సినిమా వాయిదా పడుతూ వస్తోందని చెబుతున్నారు. హారర్ సీన్స్ కావడంతో వీఎఫ్ఎక్స్ కు ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. టీజర్ వచ్చే టైమ్‌కి అయినా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ మూవీలో సంజయ్ దత్, మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.. దాదాపుగా రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో మూవీ రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×