Tejeswi Madivada: టాలీవుడ్ ఇండస్ట్రీలో తేజెస్వి మదివాడ గురించి తెలియని వాళ్ళు ఉండరు. వెంకటేష్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈమె క్రేజ్ కూడా పెరిగిపోయింది. తర్వాత పలు చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో హీరోయిన్ గా కూడా నటించి తన నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తో తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఆ షో తర్వాత ఆమె కెరీర్ డల్ అయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య వరసగా బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది.. అయితే తాజాగా ఈమెయిల్ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఆ హీరో ఎవరో? పెళ్లెప్పుడు? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హీరోతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన తేజు..
తేజస్వి హీరోతో డేటింగ్ చేస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై తేజస్వి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తుంది. తాజాగా హీరోతో పెళ్లిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజు తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. నా జీవితం తెరిచిన పుస్తకం. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక చాలా పీక్స్ చూశాను. నా బాయ్ ఫ్రెండ్ ను కోల్పోయాను. నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. నాకోసం తపన పడే వారికి ఎప్పుడూ రుణపడి ఉండాలనుకుంటాను.. నాకు నవదీప్ మంచి ఫ్రెండ్ మాత్రమే.. కానీ చాలా మంది నవదీప్ తో పెళ్లి ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారు. క్లోజ్ గా ఉంటే పెళ్లి చేసుకోవాల అని ట్రోలర్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ సినిమాలు వెరీ స్పెషల్..
సినిమాల విషయానికొస్తే..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తేజు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది.. తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత నుంచి చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. రాంగోపాల్ వర్మ ఐస్ క్రీం సినిమాతో హీరోయిన్గా మారింది తేజస్వి.. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత హీరోయిన్గా బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని తేజుకు తర్వాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తేజస్వి మదివాడకు తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వచ్చాక మరింత క్రేజ్ సొంతం అయ్యింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో తేజస్వి మదివాడ కంటెస్టెంట్ గా పాల్గొంది.. బిగ్ బాస్ తర్వాత తేజు పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తుంది.