BigTV English

Pravasthi on Sunitha: నువ్వో ఫేక్.. సింగర్ సునీతాకు ప్రవస్తి స్ట్రాంగ్ కౌంటర్, ఈసారి మరిన్ని ఆరోపణలు

Pravasthi on Sunitha: నువ్వో ఫేక్.. సింగర్ సునీతాకు ప్రవస్తి స్ట్రాంగ్ కౌంటర్, ఈసారి మరిన్ని ఆరోపణలు

Pravasthi on Sunitha:సింగర్ ప్రవస్తి (Singer Pravasthi).. గత రెండు రోజులుగా ‘పాడుతా తీయగా’ కార్యక్రమం గురించి , ఆ షో జడ్జెస్ గురించి, సింగర్ ప్రవస్తి గురించి ఎక్కడ చూసినా వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాడుతా తీయగా షో నుంచి సింగర్ ప్రవస్తిని ఎలిమినేట్ చేసిన తర్వాత తన ఆవేదనను వ్యక్తపరిచింది ప్రవస్తి. సింగర్ సునీత (Singer Sunitha), ఎం ఎం కీరవాణి (MM Keeravani) తనను టార్గెట్ చేశారని, ప్రత్యేకించి సునీత తాను పాడడానికి వస్తే నచ్చలేదు అన్నట్టుగా ముఖం పెట్టేది అని బహిరంగంగా మీడియాతో చెప్పుకొచ్చింది. అంతే కాదు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. దీంతో తన పేరు ప్రస్తావించడంతో నిన్న సింగర్ సునీత తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది. నువ్వు చేస్తున్నది తప్పు.. నువ్వు సక్సెస్ అయితే సంతోషించే వారిలో మొదటి దానిని నేనే అవుతాను. అప్పుడు ముద్దుగా పాడే దానివి.. అందుకే ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరీ నిన్ను మెచ్చుకున్నాము. ఇప్పుడు నీకు 19 ఏళ్లు.. ఇప్పుడు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేయలేము కదా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సునీత.


ఇది పక్షపాతం కాదంటారా – కడిగిపారేస్తున్న ప్రవస్తి..

అయితే దీనికి రీకౌంటర్ గా ప్రవస్తి మరొక రీల్ షేర్ చేయడం జరిగింది. అందులో ప్రవస్తి మాట్లాడుతూ అసలు నిజాన్ని బయట పెట్టింది. “సునీత మేడం.. మీరు చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశాను.. అలాగని ఇప్పుడు చేయలేం కదా.. అని అన్నారు కదా.. నేను మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోమని అడగడం లేదు.. ఒక మనిషిగా నాకు రెస్పెక్ట్ ఇవ్వమని అడిగాను. ఒక సింగర్ గా నేను ఆ రెస్పెక్ట్ కోరుకోవడంలో తప్పులేదు కదా.. మీరు ఆ రీల్ లో ఎంత బాగా మాట్లాడారో.. అదే రియల్ లో కూడా అంతే బాగా మాట్లాడి ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. చిన్నప్పుడు నేను చాలా బాగా పాడేదాన్ని, ఇప్పుడు అలా పాడడం లేదని అన్నారు.. అది మీ అభిప్రాయం.. దాన్ని నేను గౌరవిస్తాను.. సాంగ్స్ సెలక్షన్ గురించి కూడా మీరు మాట్లాడారు. వీడియో రైట్స్ గురించి మాట్లాడారు. మాకు దేనికైతే వీడియో రైట్స్ ఉన్నాయో.. ఆ పాటలను మాత్రమే ఎంచుకున్నాము. అందులో నుంచి సాంగ్ సెలెక్ట్ చేసుకుని మేము ఇచ్చాము. మీరు నా సాంగ్ రిజెక్ట్ చేయడానికి కారణం వీడియో రైట్స్ కాదు.. దేని గురించో కూడా నేను చెప్తాను.. రాఘవేంద్రరావు గారి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా నేను ఆయన సినిమాల్లోని భక్తి పాటల్లో ఒక పాటను సెలెక్ట్ చేసుకుని, ప్రొడక్షన్ వాళ్లకి ఇస్తే.. ఇది ఇవ్వడం కుదరదని చెప్పారు. కానీ వేరే కంటెస్టెంట్ తో అదే పాటను పాడించారు. ఆమె లిరిక్స్ మర్చిపోయినా సరే ఆమెకు మంచి కామెంట్ ఇచ్చారు. ముఖ్యంగా ఆమెకు సైగలు చేసి మరీ పాడించారు. ఇది తప్పు కాదంటారా..? మీరు మీ జడ్జిమెంట్ చెప్పకుండా ఎందుకు సైగలు చేశారనేది కూడా మీరే సమాధానం చెప్పాలి.


ప్రవస్తి ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పగలరా..?

ఇక మీరు కన్యాకుమారి అనే పాటకి షోలో లేకుండానే ఎక్కడికో వెళ్లాలని ముందుగానే పాట వినకుండానే జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారు. అలా ఎలా జడ్జిమెంట్ ఇస్తారు..? నేను ఎవరో పేర్లు వాడానని మీరు చెప్పారు కదా.. వాళ్ల పేర్లు నేను ఎప్పుడూ వాడలేదు.. లిరిక్స్ మరిచిపోయినా.. సరిగ్గా పాడలేని వాళ్లకు కూడా మీరు టాప్ లో మార్కులు ఇచ్చారు.. చేతి మీద రాసుకొని వచ్చి పాడుతుంటే కూడా దానిని మీరు కామెడీగా మార్చేశారు. అప్పుడది కాంపిటీషన్ అని మీకు గుర్తుకు రాలేదా..? ఇక చివర్లో వాళ్లకి మీరు ఎక్కువ మార్కులు వేశారు కదా.. ఇది పక్షపాతం కాదా..? అంటూ తన బాధలన్నింటిని వీడియో ద్వారా వెల్లడించింది ప్రవస్తి. ప్రస్తుతం ప్రవస్తి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో అటు ప్రవస్తీకి కూడా మద్దతు పెరుగుతోందని చెప్పవచ్చు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×