E-Paper
Advertisement

Rajamouli Invited by Oscar Academy: అరుదైన గౌరవం.. జక్కన్న దంపతులకు ఆస్కార్ ఆహ్వానం..

Rajamouli Invited by Oscar Academy: అరుదైన గౌరవం.. జక్కన్న దంపతులకు ఆస్కార్ ఆహ్వానం..
Advertisement

Rajamouli Couple Invited by Oscar Academy: ఆస్కార్ అవార్డ్. ఈ అవార్డును అందుకోవడం హాలీవుడ్ వారికి కొత్త కాదు కానీ.. తెలుగు సినిమాకు ఆస్కారం రావడం అనేది ఎంతో అమూల్యమైన విషయం. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్ల కలగా ఉన్న ఆస్కార్ ను RRR సినిమాతో తీసుకొచ్చారు రాజమౌళి. ఈ సినిమాలో కంపోజ్ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును అందుకుంది.

గతేడాది మార్చి 13న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో.. నాటు నాటుపాటకు ఆస్కార్ దక్కింది. ఈ వేడుకకు సినిమా దర్శకుడ రాజమౌళి కుటుంబంతో పాటు రామ్ చరణ్ దంపతులు, ఎన్టీఆర్ దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి, పాటరాసిన చంద్రబోస్, పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ అంతా హాజరయ్యారు. RRRకు ఆస్కార్ దక్కిన ఆ క్షణాలను తలచుకుంటే.. ఇప్పటికే ఏదో సాధించామన్న ఫీలింగ్ వస్తుంది మూవీ లవర్స్ కు. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేశారు జక్కన్న. ఇలా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

రాజమౌళి క్రేజ్ అక్కడితో ఆగిపోలేదు. ఈ ఏడాది ఆయనకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. మరోసారి ఆయన ఆస్కార్ అవార్డుల వేడుకకు అతిథిగా వెళ్లనున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో చేరాలని రాజమౌళికి, ఆయన భార్య రమకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం వచ్చింది. వీరిద్దరితో పాటు.. బాలీవుడ్ ప్రముఖులు షబానా అజ్మీ, రితేష్ సిధ్వాని, రవి వర్మన్ వంటి వారికి కూడా ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. 57 దేశాల్లో 487 మంది కొత్తవారికి ఈసారి ఆస్కార్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.

Also Read : రాజమౌళి ఆఫర్ నే రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ?

Advertisement

కాగా.. ఆస్కార్ అకాడమీలో చేరితో.. ఆస్కార్ రేసులో ఉన్న సినిమాలకు ఓటేసే హక్కు వస్తుంది. అంతేకాదు అకాడమీ తరఫున జరిగే ఈవెంట్లకు, అకాడమీ లైబ్రరీకి వెళ్లొచ్చు. స్పెషల్ స్క్రీనింగ్స్, వర్క్ షాప్స్, సెమినార్లకు హాజరు కావొచ్చు. గతేడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, కెకె సెంథిల్, సాబు సిరిల్ లు అకాడమీలో చేరారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×