Will ICC Take Action on Gulabdin Naib for His Alleged Cheating Allegations AFG Vs BAN:
టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో జరిగిన చివరి మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. బాల్ బాల్ కి మధ్య గెలుపోటములు ఇరుజట్లవైపు దోబుచులాడిన మ్యాచ్ లో ఆఫ్గాన్ గెలిచినా.. కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఆఫ్గాన్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఐసీసీ సీరియస్ గా ఉందనే వార్తలు రావడంతో మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.
అందరికీ తెలిసిన విషయమే.. ఆఫ్గాన్ మొదట బ్యాటింగ్ చేసి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే వర్షం పడే అవకాశాలు ఉండటంతో మ్యాచ్ ని ఆలస్యం చేయమని ఆఫ్గాన్ హెడ్ కోచ్ ట్రాట్ డగౌట్ నుంచి సూచనలు చేశాడు. వెంటనే గుల్బాదిన్ దానిని అక్షరాలా అమలు చేశాడు.
ఈ టెక్నిక్ వర్కవుట్ అయ్యింది. సరిగ్గా బంగ్లాదేశ్ 11.4 ఓవర్లు ముగిసే సరికి 81/7 పరుగులు చేసింది. అప్పుడు వర్షం చినుకులు మొదలవుతున్నాయి. ఈ సమయంలో మ్యాచ్ ఆగిపోతే డీఎల్ సీ ప్రకారం బంగ్లాదేశ్ గెలుస్తుంది. అప్పటికి మ్యాచ్ లో 2 పరుగులతో ముందంజలో ఉంది.
Also Read: Pakistan Cricket Players: బాబూ.. ఎంతో కొంత ఇవ్వండి! పాకిస్తాన్ ఆటగాళ్ల దైన్యం..
ఈ సమయంలో అంపైర్లు ఏం చేశారంటే.. ఓ ఓవర్ ను ఫినిష్ చేయాలని భావించారు. ఈ క్రమంలో అప్పటికే 4 బంతులు వేసిన నూర్ అహ్మద్ ను అంపైర్లు ఓవర్ పూర్తి చేయమని ఆదేశించారు. అక్కడ గానీ ఒక ఫోర్ వచ్చిందంటే, ఇక ఆఫ్గాన్ పని అయిపోయినట్టే. ఈ క్రమంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదిన్ నయిబ్ ఒక్కసారి కిందపడిపోయాడు.
కండరాలు పట్టేశాయంటూ నొప్పితో విలవిల్లాడినట్టు నటించాడు. అని అందరూ అనేమాట. ఈ సమయంలో వర్షం పెద్దదైంది. దీంతో మ్యాచ్ ని అంపైర్లు నిలిపేశారు. ఫిజియో వచ్చి నయిబ్ ను జాగ్రత్తగా తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడివరకు డ్రామా అంతా బాగానే ఉంది. అంత నొప్పితో విలవిల్లాడిన నయిబ్ వచ్చి, రెండు ఓవర్లు బౌలింగు వేశాడు. ఇక్కడే అందరికీ అనుమానాలు వచ్చాయి.
హమ్మా.. నయీబు ఎంత పనిచేశావని అందరూ ముక్కున వేలేసుకున్నారు. మ్యాచ్ అయ్యిన తర్వాత మాత్రం తను ఛీటింగు చేశాడనే విమర్శలు మిన్నంటాయి. మాజీలు చాలామంది నయీబ్ కి ఆస్కార్ ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు.
Also Read: ‘డక్‌వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూత
కొందరు ఏమంటున్నారంటే, తను రెండు బాల్స్ ఉండగా లేట్ చేశాడు. నిజంగా మ్యాచ్ రద్దయిపోతే, అప్పుడు అనుకోవాలి. మళ్లీ మ్యాచ్ స్టార్టయ్యింది. ఆఫ్గాన్లు అద్భుతంగా ఆడారు కదా అంటున్నారు.
ఐసీసీ రూల్ బుక్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఆలస్యం చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించే అవకాశం ఉంది. అంతేకాదు 5 పరుగుల పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంది. అయితే అంపైర్లు పెనాల్టీ విధించలేదు. వాళ్లేం రిపోర్ట్ చేయలేదు. కానీ ఐసీసీ మాత్రం ఈ విషయంలో సీరియస్ గా ఉందనే వార్తలు వినిస్తున్నాయి.