BigTV English

SSMB29: మహేష్ బాబు సినిమా టైటిల్ చెప్పేసిన రాజమౌళి.. ?

SSMB29: మహేష్ బాబు సినిమా టైటిల్ చెప్పేసిన రాజమౌళి.. ?

SSMB29: ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం SSMB29.   మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై  అభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం భారీ అంచనాలను పెట్టుకుంది. గుంటూరు కారం సినిమా తరువాత మహేష్.. తన టైమ్ మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టాడు.  ఇప్పటికే ఈ సినిమా   స్క్రిప్ట్ పనులు  పూర్తయినట్లు తెలుస్తోంది.


ఇంకోపక్క ఈ చిత్రం కోసం మహేష్ .. లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగా రెడీ అవుతున్నాడు. గడ్డం, జుట్టు పెంచుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త వచ్చినా..  సెకన్స్ లో వైరల్ గా మారిపోతుంది. మొన్నటివరకు ఈ సినిమా టైటిల్  అది, ఇది అనుకుంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక ఎట్టకేలకు   ఈ సినిమా టైటిల్ ను రాజమౌళినే చెప్పుకొచ్చేసాడు.

తాజాగా  జక్కన్న.. ఒక ఈవెంట్ లో పాల్గొన్న జక్కన్న తన మైండ్ లో ఉన్న టైటిల్ పేరును చెప్పుకొచ్చాడు. బాహుబలి తరువాత మీ మైండ్ లో ఉన్న ప్రాజెక్ట్స్  ఏంటి అని  ఒక అభిమాని అడగగానే.. ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ గరుడ.. గరుడ  అని అరవడం మొదలుపెట్టారు. ఇక దీనికి సమాధానంగా రాజమౌళి  మాట్లాడుతూ.. ” అవును నా మైండ్ లో కూడా గరుడ ఉంది. కానీ, ఇంతకుమించి ఎక్కువ డిటైల్స్ ను నేను ఇప్పుడు బయటపెట్టలేను” అని చెప్పుకొచ్చాడు.


ఇక ఆ ఒక్క మాటతో SSMB29 టైటిల్ గరుడ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.  ఈ వీడియో వచ్చిన సెకండ్స్ లోనే  మహేష్ బాబు గరుడ పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే గరుడనే నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి త్వరలోనే జక్కన్న గరుడ టైటిల్ ను రివీల్ చేస్తాడేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×