Coriander Seeds Water: ధనియాలతో ఆహారం రుచినే మార్చేయవచ్చు. ధనియాలతో తయారుచేసిన పొడిని కూరల్లో ఉపయోగించడం వల్ల రుచి మరింత పెరిగిపోతుంది. అయితే కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు ధనియాలను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్న వారు ధనియాలు తింటే ఔషధంలా పనిచేస్తాయి. అయితే కేవలం కూరల్లో మాత్రమే కాకుండా ప్రతీరోజూ ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. థైరాయిడ్ సమస్యల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇందులో వాత మరియు కఫ దోషాల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అందువల్ల ధనియాలను తీసుకుంటే వీటిలో ఉండే పొటాషియం, ఇనుము వంటి ఉపశమనం కలిగిస్తాయి.
ధనియాలలో ఉండే విటమిన్ ఎ,సి,కె, ఫైబర్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ధనియాలతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి పుష్కలమైన పోషకాలు అందుతాయి. ధనియాలను చాలా రకాలుగా తీసుకోవచ్చు. అందులో ఎక్కువగా నానబెట్టిన నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకుంటే ఉపశమనం పొందుతారు. ఇలా తరచూ తీసుకోవడం వ్లల పేగు సంబంధింత సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి రాత్రి పూట నీటిలో నానబెట్టిన ధనియాలను తెల్లవారు జామున పరగడుపున తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ధనియాలు నానబెట్టిన నీరు సహాయపడుతుంది. అంతేకాదు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. మరోవైపు ధనియాల నీటిని తాగడం వల్ల డయాబెటీస్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ధనియాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ రసాయనాలు కూడా శరీరంలో మంటను తొలగిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
దీర్ఘకాలికంగా ఉండే వ్యాధుల నుంచి కూడా ధనియాలు నానబెట్టిన నీరు ఉపశమనం కలిగిస్తుంది. ధనియాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బహిష్టు సమయంలో కూడా ఈ నీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ నీరు తోడ్పడుతుంది. చర్మ సమస్యలు తగ్గించుకునేందుకు కూడా సహాయపడుతుంది. ఒత్తిడి ఉన్న సమయంలో కూడా వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)