BigTV English

Rajamouli : ఏంటి జక్కన్న.. తెలుగు హీరోలను వదిలేశావా?

Rajamouli : ఏంటి జక్కన్న.. తెలుగు హీరోలను వదిలేశావా?

Rajamouli : టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు.. అందుకే ఈయనకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తారా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. త్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లి హాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యారు. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఇక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడమే పని.. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పక్కనపెట్టి తమిళ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..


అసలు విషయానికొస్తే.. తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు ఆయనకు ఎవరితో సినిమా అనేదానిపై ఆసక్తి కర విషయాలను బయటపెట్టారు. హీరో కార్తి తన నెక్స్ట్ సినిమా సత్యం సుందరం ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో ఓ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.. ఈ క్రమంలో గౌతమ్ మీనన్ మాతో ఓ సినిమా చేస్తారా అని అడిగారు. ఇద్దరం కలిసి నటిస్తాం. కానీ అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. మాకు నచ్చితే సినిమాను చేస్తామని కార్తి చెప్పాడు. అంతేకాదు గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు అని కార్తీ తెలిపాడు.. కార్తీ పాయింట్ ను పట్టుకొని తెలుగు సినిమా అభిమానులు జక్కన్న పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Rajamouli is planning a film with Tamil heroes
Rajamouli is planning a film with Tamil heroes

RRR సినిమాను సూర్య, కార్తీలు చెయ్యాలనుకున్నారా?

తాజాగా కార్తీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. రాజమౌళి గురించి టాప్ సీక్రెట్ ను రీవిల్ చేశారు. తమిళ హీరోల దగ్గరకు ఆయన వెళ్లి మల్టీ స్టారర్ సినిమా స్టోరీని చెప్పినట్లు బయటపెట్టాడు. కార్తీ, సూర్యలను రాజమౌళి కలిసి స్టోరీ వినిపించారట.. అది సరిగ్గా నచ్చక పోవడంతో ఆ ఇద్దరు రిజెక్ట్ చేసినట్లు కార్తీ ఓ ఇంటర్వ్యూ తెలిపారు. ఈ వార్త విన్న నెటిజన్స్ ఆ సినిమా త్రిపుల్ ఆర్ కాదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమా కాదా అన్నది జక్కన్న చెప్పాల్సిందే.. ఇక రాజమౌళి తెరకేక్కించిన సినిమాల్లో త్రిపుల్ ఆర్ సినిమాకు రెస్పాన్స్ ఏ రేంజులో ఉందో మనం చూశాం. ఈ మూవీ స్టోరీ కొత్తగా ఉండటం తో జనాలు ఈ సినిమాను ఆదరించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ యూ ప్రధాన పాత్రలో నటించారు. వాళ్ల పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.. జీవించి నటించారు. సినిమాలోని ప్రతి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా రావడం విశేషం. ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుందని సమాచారం..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×