BigTV English
Advertisement

Rajamouli : ‘ఈగ ‘కి డబ్బింగ్ చెప్పింది ఈయననా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Rajamouli : ‘ఈగ ‘కి డబ్బింగ్ చెప్పింది ఈయననా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Rajamouli : తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడు రాజమౌళి పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. దర్శకుడుగా ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ భారతీయ సినీ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈయన తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రాజమౌళికి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగిపోతుంది. సినిమాతో ఆస్కార్ కూడా అందుకోవడంతో ఆయనతో సినిమా తీయడానికి స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం హీరోల గురించి కొత్తగా చూపించడమే చూసాం కానీ రాజమౌళి తాను దర్శకత్వం వహించిన ఓ సినిమాకి డబ్బింగ్ చెప్పాడు అన్న విషయం చాలామందికి తెలియదు.. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఏ హీరోకి డబ్బింగ్ చెప్పాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


రాజమౌళి డబ్బింగ్ చెప్పిన ఒక్క సినిమా..? 

రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమంలోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేశాడు. ఈయనతో సినిమాలు చేయాలని హీరోలు పోటీ పడుతుంటారు. అయితే రాజమౌళితో సినిమాలంటే మామూలు విషయం కాదు. పెద్ద సాహసాలు చేయాల్సి వస్తుంది.. దీనికన్నా ముందు ఈయనతో సినిమా చేయాలంటే దాదాపు రెండు మూడేళ్లు ఈయన దగ్గరే ఉండిపోవాలి. మరో సినిమాకి కమిట్ అవ్వాల్సిన పనిలేదు. అయితే రాజమౌళి ఇప్పటివరకు సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ ఓ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పాడని చాలామందికి తెలియదు. ఏంటి ఇది నిజమా అని అనుకుంటున్నారు కదా అవును నిజమే.. రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో ఈగ సినిమా ఒకటి.. ఈ సినిమాలోని ఈగకు రాజమౌళి డబ్బింగ్ చెప్పిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా. ఇది చూసిన నెటిజన్లు రాజమౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు. ఇది నిజం బయటపడటంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు..


Also Read :దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్.. జక్కన్న ప్లానేంటో..?

మహేష్ బాబుతో రాజమౌళి సినిమా.. 

గతంలో త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని అందుకోవడంతో పాటుగా.. సినిమాలోని ఒక పాటకు ఆస్కార్ కూడా దక్కడంతో ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకింది.. జక్కన నుంచి మరో సినిమా రావాలని విదేశీయులు కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రాజమౌళి తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకురావాలని జక్కన్న భావిస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత త్రిపుల్ ఆర్ మూవీకి మరో సినిమా రాబోతుందని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్.. సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉందని సమాచారం.. అలాగే ప్రభాస్ తో బాహుబలి 3 చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసిందే..

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×