BigTV English

Jr NTR: దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్.. జక్కన్న ప్లానేంటో..?

Jr NTR: దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్.. జక్కన్న ప్లానేంటో..?

Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఈయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈయన వార్ 2 తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న తారక్, ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ ఓ బయోపిక్ లో నటించబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఆయన కనిపించనున్నారని ఇండస్ట్రీలో టాక్.. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


ఎన్టీఆర్ సినిమాల లైనప్..

నందమూరి హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఇప్పుడైనా నాలుగు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ‘వార్ 2’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇది ఆయనకు బాలీవుడ్ డెబ్యూ. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కోటల శివ కాంబినేషన్లో దేవర 2 సినిమా చేయబోతున్నాడు.. ఆ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.. వీటితో పాటుగా ఎన్టీఆర్ ఒక బయోపిక్ లో నటించబోతున్నాడు అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఆ మూవీ గురించి కాస్త వివరంగా..


Also Read :తినడానికి తిండి లేదు.. ఒక్కపూట కోసం ఎన్ని కష్టాలో.. ఉద్యోగం కోసం వెళ్తే దారుణం..

దాదాసాహెబ్ పాల్కేగా ఎన్టీఆర్.. 

ఎన్టీఆర్ ఎటువంటి పాత్రలోనైనా జీవించి నటిస్తారు. ఏ సినిమాలోనైనా ఆ పాత్రలో ఒదిగి పోతారు. ఎన్టీఆర్ నటనకు డాన్స్ కు అభిమానులు ఎక్కువే. అందుకే ఏ పాత్రలోనైనా ఎన్టీఆర్ చేస్తారని తెలుగు ప్రేక్షకులు నమ్ముతున్నారు. అయితే చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్‌ కక్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మాక్స్‌ స్టూడియోస్‌, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై వరుణ్‌ గుప్తా, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఈ సినిమాని నిర్మించనున్నారని ఫిలింనగర్ లో టాక్.. అంతలోనే ఫాల్కే గెటప్ లో తారక్ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కథ గురించి ఎన్టీఆర్ తో డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే అంతలోనే ఫాల్కే గెటప్ లో తారక్ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు… మరి దీనిపై ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఇలాంటి సినిమాలు ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×