Train Catches Fire: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించి అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. డెమో ప్యాసింజర్ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని రైల్వే సిబ్భందికి తెలిపారు. బీబీనగర్ వద్ద రైలును ఆపడంతో అగ్నిమాపక సిబ్భంది మంటలు అదుపు చేశారు. దీంతో గంట నుంచి బీబీ నగర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో పలు ట్రైన్‌ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే సిబ్బంది తెలిపింది. షార్ట్ షర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైన రీజన్ ఉందా? అని అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బుధవారం సాయంత్రం కాంట్ స్టేషన్ ప్లాట్ ఫామ్ నెంబర్ 11పై.. లక్నో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే బోగీ పొగతో నిండిపోయింది. సైరన్ మోగడంతో అప్రమత్తమైన రైల్వే కార్మికులు వాటర్ హైడ్రాంట్, అగ్నిమాపక యంత్రాల సహాయంతో సకాలంలో మంటలను ఆర్పివేశారు.
Also Read: బ్రిటిష్ కాలంలో పునాది పడినా ఇప్పటికీ పూర్తికాని రైల్వే లింక్, ఇదీ అసలు సంగతి!
రైలు నెం-24203 వారణాసి – లక్నో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఖాళీ రేక్ ప్లాట్‌ఫారమ్ నెం.-11 పై నిలబడి ఉంది. రైలు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు.. విద్యుత్ సరఫరా చేసే నేపథ్యంలో AC చైర్ కార్ (C-1) కు ఛార్జింగ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇంతలో, ప్యానెల్‌లో ఏర్పాటు చేసిన పరికరం (రోటరీ స్విచ్)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా.. పొగలు రావడం ప్రారంభించాయి. బోగీ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు.