BigTV English
Advertisement

Rajinikanth’s Coolie: తెలుగులో భారీ బిజినెస్.. థియేట్రికల్ రైట్స్ వారి సొంతం..!

Rajinikanth’s Coolie: తెలుగులో భారీ బిజినెస్.. థియేట్రికల్ రైట్స్ వారి సొంతం..!

Rajinikanth’s Coolie : సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) 6 పదుల వయసు దాటినా కూడా వరుస యాక్షన్ చిత్రాలు చేస్తూ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే చివరిగా జైలర్ (Jailor) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రజినీకాంత్.. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) దర్శకత్వంలో కూలీ (Coolie) సినిమా చేస్తున్నారు. LCU నుండి వరుస బ్లాక్ బాస్టర్ లతో అదరగొట్టేస్తున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో తెలుగు సీనియర్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న సితార..

దీనికి తోడు విశాఖపట్నంలో నాగార్జున షూటింగ్ చేస్తున్న వీడియో కూడా ఆన్లైన్లో లీక్ అయి తెగ హల్చల్ చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ , ఓటీటీ బిజినెస్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. రికార్డ్ స్థాయిలో థియేట్రికల్, ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని కూడా సితార ఎంటర్టైన్మెంట్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. గతంలో లియో, ఇప్పుడు దేవర లాంటి పాన్ ఇండియా సినిమాల తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఈ సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను కూడా సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే ఎంత ధరకు కొనుగోలు చేశారన్న విషయం ఇంకా తెలియలేదు.


రెమ్యునరేషన్ తో షాక్ ఇచ్చిన రజనీకాంత్..

Rajinikanth Coolie: Big business in Telugu.. Theatrical rights are theirs..!
Rajinikanth Coolie: Big business in Telugu.. Theatrical rights are theirs..!

భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రానికి రజనీకాంత్ ఏకంగా రూ.260 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలి అంటే కూలీ మూవీతో సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా కొత్త రికార్డు సృష్టించబోతున్నారు రజినీకాంత్. ఇప్పటి వరకు ప్రభాస్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు మాత్రమే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలుగా నిలిచారు. అయితే వీరి రెమ్యునరేషన్ ను బ్రేక్ చేస్తూ కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ఏకంగా గోట్ చిత్రం కోసం రూ .200 కోట్లకు పైగా పారితోషకం తీసుకొని ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ఆ రికార్డును రజినీకాంత్ బ్రేక్ చేశారని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.260 కోట్లు పారితోషకం తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడంతో.. మినీ సైజు పాన్ ఇండియా మూవీ తీయవచ్చు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

రెమ్యునరేషన్ పెంచేసిన లోకేష్..

మరొకవైపు ఈ సినిమా కోసం డైరెక్టర్ లోకేష్ కూడా రూ.60 కోట్లు అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో రజినీకాంత్ కూతురుగా శృతిహాసన్ నటిస్తూ ఉండగా, ఈ యాక్షన్ డ్రామా మూవీలో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. సన్ పిక్చర్స్ సంస్థ వారు నిర్మిస్తున్నారు.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×