Zumba Dance: ప్రతిరోజూ అదే రొటీన్ వ్యాయామంతో చాలామంది బోర్ ఫీలవుతుంటారు. ఉదయం జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేయాలన్నా.. ఇంటి వద్దే కసరత్తులు చేయాలన్నా బద్ధకిస్తుంటారు. అలాంటి వారికి అటు ఆనందం, ఇటు ఆరోగ్యాన్ని సొంతం చేస్తుందీ జుంబా డాన్స్. గతంలో మెట్రో నగరాలకే పరిమితమైన ఈ ఫిట్‌నెస్ సెంటర్లు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలోనూ కనిపిస్తున్నాయి. 12 ఏళ్ల పిల్లల నుంచి 50 ఏళ్ల గృహిణుల వరకు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. థైరాయిడ్, పీసీఓడీ, అధిక బరువు, తదితర ఇబ్బందులతో బాధపడే స్త్రీలు జుంబా వ్యాయామంతో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆడుతూ పాడుతూ చేసే ఈ జుంబా డాన్స్‌లో ఫాస్ట్, ప్లో డాన్స్ మూమెంట్స్ ఉండటం వల్ల బాడీలోని ప్రతి అవయవ కండరం కదులుతుంది.ఈ వ్యాయామం కండరాలను పటిష్ఠంగా మారుస్తుంది. ప్రతిరోజూ గంటపాటు జుంబా డాన్స్ చేయడం ద్వారా సామర్థ్యం పెరిగి, నిస్సత్తువ దూరమవుతుంది అంటున్నారు నిపుణులు.
ప్రత్యేకంగా మహిళల కోసం.. ఈ ఫిట్‌నెస్ సెంటర్లు డాన్స్ నేర్పించడానికి సర్టిఫైడ్ ట్రైనర్లను కూడా నియమిస్తారు. మన శరీరమంతా కదిలేలా, అలాగే విసుగు చెందకుండా స్టెప్పులు వేయిస్తూ, వ్యాయామం చేయిస్తారని నిపుణులు తెబుతున్నారు. బాడీలో అధిక మోతాదులో ఎక్కవ కొవ్వు ఉన్నా.. కండరాల బలోపేతం(Ball workout), తొడల బలోపేతం(Stepper Workout), కోర్ స్ట్రెంగ్త్ (Core Strength) వంటి వ్యాయామాలు చేయిస్తారు.
* జుంబా డాన్స్ చేయడం వల్ల చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శరీరంలో ఉన్న టాక్సిన్లు సులభంగా బయటకుపోతాయి.
* ఈ డాన్స్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. వ్యాధినిరోధశక్తి రెట్టింపు అవతుంది. ఇన్ఫెక్షన్ల ముప్పు నుంచి దూరంగా ఉండవచ్చు.
* ఈ డాన్స్‌తో ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఈ ఎండార్ఫిన్లు సంతోషాన్ని పెంచే హార్మోన్లు.
* ఆడుతూ పాడుతూ స్టెప్స్ వేయడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. జుంబా డాన్స్‌తో ఒత్తిడి, ఆందోళన దరిచేరదు.
* ప్రతిరోజూ జుంబా డాన్స్ చేయడం వల్ల ఎలాంటి బరువులు ఎత్తకుండానే త్వరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
* జుంబాతో జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఆరోగ్యం రెట్టింపు అవుతుంది.